స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శివాత్మిక హాట్ షో.. నల్ల చీరలో ఆ అందాలు చూపిస్తూ!

సినీ గ్లామర్ ఫీల్డ్ లో సెలబ్రిటీల కొడుకులు, కూతుళ్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఒక సినిమాతో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమ టాలెంట్ తో సత్తా చాటుతున్న హీరో హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంట్రీ ఇస్తే.. మరికొంతమంది వారికి సినీ రంగం తెగ నచ్చి అడుగు పెడతారు.

అలా చిత్ర పరిశ్రమపై అభిమానంతో అడుగు పెట్టిన అందమైన అమ్మాయిల్లో సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తే శివాత్మిక రాజశేఖర్ ఒకరు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రాజ శేఖర్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి.

నటనకు మంచి మార్కులు..

నటనకు మంచి మార్కులు..

హీరో రాజశేఖర్, దర్శకురాలు, నటి జీవిత దంపతుల చిన్న కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైన శివాత్మిక.. 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేశాడు. ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చిన ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. కానీ, ఇందులో శివాత్మిక చేసిన నటన, కనబరిచిన హావభావాలకు మాత్రం విశేషమైన పేరు దక్కింది.

క్రేజీ డైరెక్టర్ దర్శకత్వంలో..

క్రేజీ డైరెక్టర్ దర్శకత్వంలో..

'దొరసాని' సినిమాతో హీరోయిన్‌గా గ్రాండ్‌ గా ఎంట్రీ ఇవ్వలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు ఆ తర్వాత సినిమా అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. కానీ, శివాత్మిక రాజశేఖర్ మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ నటి రమ్యకృష్ణ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో క్రేజీ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న 'రంగమార్తండ' సినిమాలో శివాత్మిక కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ఉపయోగపడని పంచతంత్రం..

ఉపయోగపడని పంచతంత్రం..

శివాత్మిక రాజశేఖర్ గత ఏడాది 'ఆకాశం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలైన దీనికి ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. ఆ తర్వాతనే ఈ బ్యూటీ 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలైంది. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్రను పోషించారు. అయితే ఈ పంచతంత్ర సినిమా కూడా శివాత్మిక రాజశేఖర్ కు అంతగా ఉపయోగపడలేదనే చెప్పవచ్చు.

తనదైన చిత్రాలతో..

తనదైన చిత్రాలతో..

గ్లామరస్ బ్యూటి శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు సిద్ధమైంది బ్యూటిఫుల్ శివాత్మిక రాజశేఖర్.

ఫొటోలు వదులుతూ..

ఫొటోలు వదులుతూ..

ఇక సినిమా ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండా చిత్రాలను చేస్తూ దూసుకుపోతోన్న శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలో కూడా చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదలుతూ నిత్యం అభిమానులు, ఫాలోవర్లతో టచ్ లో ఉంటూ ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

నల్ల చీరలో అందంగా..

నల్ల చీరలో అందంగా..

ఇక ఇటీవల శివాత్మిక రాజశేఖర్ హాట్ ఫొటోలు వదులతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరోయిన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని హాట్ గా దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్ చీరలో తన బ్యాక్ అందాలను ఆరబోసింది ఈ భామ. అలాగే, అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X