శివాత్మిక నీవు కేక.. దీపిక, మలైకా, ప్రియాంక నీకు పోటీనా?.. వైరల్‌గా బ్యూటీ ఫోటోలు
యాంగ్రీ హీరో రాజశేఖర్, జీవిత దంపతుల ముద్దుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ఇటీవల కాలంలో మంచి జోష్‌లో కనిపిస్తున్నారు. దొరసాని చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి అదృష్టం కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. తాజాగా పంచతంత్రం అనే మూవీతో సత్తాను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా శివాత్మిక చేసిన ఫోటోషూట్ అందరి కనుబొమ్మలు ఎగిరేలా చేసింది.
తాజాగా జీన్స్ పాంటు డిజైనర్ జాకెట్‌ను ధరించిన ఫోటోలను శివాత్మిక తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. పాతతరం టెలిఫోన్ పట్టుకొని ఫోజిచ్చిన శివాత్మికపై ఆమె వింటేజ్ లుక్‌ను నెటిజన్లు ఎంజాయ్ చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు.

అయితే శివాత్మిక రాజశేఖర్ పోస్టుపై ఆమె సోదరి శివానీ నాటీగా స్పందించారు. దీపిక పదుకోన్, మలైకా అరోరా, ప్రియాంక చోప్రా.. నీకు ఎవరూ పోటీ రాలేరు ఇక. శివాత్మిక నీవు కేక అంటూ కామెంట్ పెట్టింది. శివానీ కామెంట్ కూడా నెటిజన్లను సినీ వర్గాలను విశేషంగా ఆకర్షిస్తున్నది.

ఇటీవలే శివాత్మిక జన్మదిన జరుపుకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా త్వరలో విడుదల కానున్న పంచతంత్రం చిత్రంలోని ఆమె లుక్‌ను రిలీజ్ చేయగా అందర్నీ ఆకట్టుకొన్నది. తాజా బ్యూటీఫుల్ ఫోటోషూట్ కూడా అందర్నీ ఫిదా చేస్తున్నది.


Click it and Unblock the Notifications











