శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్
సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపించి.. ఇప్పటికీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోన్న స్టార్ రాజశేఖర్. ప్రముఖ నటి, దర్శకురాలు జీవితను వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పటికే టాలీవుడ్‌లోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరే శివాత్మిక రాజశేఖర్. తొలి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ హాట్ ఫొటోలను వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శివాత్మిక కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూడండి!

దొరసానిలా ఎంట్రీ ఇచ్చింది
స్టార్ డాటర్ అయిన శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. కానీ, ఇందులో శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కింది.

క్రేజీ ప్రాజెక్టు... వరుస ఆఫర్లు
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు ఆ తర్వాత సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిలోనే నటిస్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో భాగమైంది. ఈ మూవీలో శివాత్మిక కీలక పాత్రను చేస్తోంది.

వాటిలోనూ సినిమాలు చేస్తూ
ఇప్పటికే 'రంగమార్తాండ' షూటింగ్‌ను పూర్తి చేసుకున్న శివాత్మిక రాజశేఖర్.. ప్రస్తుతం 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 'ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటి షూటింగ్‌లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే, ఇప్పుడీ భామ మరికొన్ని కథలను కూడా వింటోంది. వాటిలో కొన్నింటిని ఓకే చేసిందని టాక్.

మూవీలు.. సిరీస్‌లతో బిజీగా
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న శివాత్మిక రాజశేఖర్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను జెట్ స్పీడుతో ముందుకు తీసుకు వెళ్తోన్న శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు హైలైట్ అవుతోంది.

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్
సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా అందరి దృష్టిలో పడడంతో పాటు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

శివాత్మిక అందాల జాతర
యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, డార్క్ రూమ్‌లో అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











