శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!
సినీ రంగంలో హీరోయిన్లుగా కొనసాగడం చాలా కష్టం అనే చెప్పాలి. అలాంటిది ఎవరైనా స్టార్ల వారసులు ఎంట్రీ ఇస్తే.. వాళ్లపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్ కిడ్‌లు వచ్చారు. అందులో ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. బడా ఇమేజ్‌తో వచ్చినా తనదైన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలో సందడి చేస్తూ తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసం!

దొరసానిగా ఎంటరైన బ్యూటీ
సినీ జంట జీవితా రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక 'దొరసాని' అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ హిట్ అయితే కాలేదు. కానీ, ఇందులో శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలకు విమర్శలకు నుంచి ప్రశంసలు వచ్చాయి.

ఫుల్ ఆఫర్లు.. క్రేజీ సినిమాలో
హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో శివాత్మిక మంచి పాత్ర చేస్తోంది. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది.

ఆకాశంతో రాక.. ఆ మూవీలు
శివాత్మిక రాజశేఖర్ ఇటీవలే 'ఆకాశం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలైన దీనికి ఆశించిన రీతిలో స్పందన దక్కలేదనే చెప్పాలి. ఇక, ప్రస్తుతం ఈ భామ 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ భాగం అయింది. ఇలా శివాత్మిక తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనదైన మార్క్ చూపిస్తోంది.

తెగ సందడి.. అన్నింట్లోనూ
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ పార్టీలు, పర్సనల్ ట్రిప్‌లతో హడావిడి చేసేస్తోంది. మరోవైపు, తనపై, తన ఫ్యామిలీపై వచ్చే రూమర్లకు గట్టిగానే రిప్లైలు ఇస్తోంది. ఇలా ఈ స్టార్ డాటర్ అన్నింట్లోనూ ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగా
ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్తోన్న శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అందాలతో రెచ్చగొడుతూ
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే బోల్డు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ తెగ హైలైట్ అవుతోంది.

శివాత్మిక ఫొటోలు వైరల్‌గా
టాలీవుడ్ స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్టైలిష్ డ్రెస్ వేసుకుని టాప్ టూ బాటమ్ గ్లామర్ షో చేస్తోంది. అలాగే, అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











