హాట్ షోలో హద్దు దాటిన శివాత్మిక రాజశేఖర్: వామ్మో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో స్టార్లకు వారసులుగా వచ్చింది మాత్రం చాలా తక్కువే. ఇలా పరిచయమైన వారిలో సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మక ఒకరు. రెండేళ్ల క్రితమే ఈ అమ్మాయి సినిమాల్లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. మొదటి చిత్రంలోనే చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హవాభావాలు పలికిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాల ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శివాత్మిక కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరూ చూడండి!

దొరసానిలా పరిచయమైంది
జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురిగా 'దొరసాని' అనే సినిమాతో శివాత్మక హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఫలితంగా మంచి పేరొచ్చింది.

రంగమార్తండలో భాగమైంది
'దొరసాని' తర్వాత శివాత్మిక రాజశేఖర్‌కు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంపిక చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో భాగమైంది. ఇందులో శివాత్మిక ఎంతో ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

వరుస మూవీలతో ఫుల్ బిజీ
శివాత్మిక రాజశేఖర్ వరుసగా సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే 'రంగమార్తాండ' షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సుందరాంగి.. ప్రస్తుతం 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 'ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటి షూటింగ్‌లను కూడా ఆమె దాదాపుగా పూర్తి చేసుకుంది.

వాటిలో కూడా నటిస్తోందిగా
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న శివాత్మిక రాజశేఖర్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు తెలుగు, తమిళ చిత్రాలను ఒప్పుకుంటూ ముందుకెళ్తోంది.

లవ్ కాంట్రవర్శీ.. పోస్టులతో
ఇటీవలే రాజశేఖర్ కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్ పారిపోయిందని ఓ న్యూస్ వైరల్ అయింది. దీనిపై శివాత్మిక స్పందిస్తూ.. 'ప్రియుడితో పారిపోయామని వార్తలు రాస్తున్నారు. ఇంతకీ పారిపోయింది నేనా? మా అక్కనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరో? నెక్స్ట్ లెవల్ న్యూస్ రాస్తున్నారు. కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి' అని మండిపడింది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

బ్రాతో రెచ్చిపోయిన బ్యూటీ
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండే శివాత్మిక రాజశేఖర్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, డార్క్ బ్యాగ్‌డ్రాప్‌లో అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా వీటిని నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











