For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ ట్రీట్: అలా అందాలను చూపిస్తూ ఘాటుగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు తమ తమ నట వారుసులుగా కుమారులనే పరిచయం చేశారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే తమ కూతుళ్లతో తెరంగేట్రం చేయించారు. అలాంటి వారిలో జీవిత, రాజశేఖర్ దంపతులు కూడా ఉన్నారు. వీళ్ల ఇద్దరు కుమార్తెలు ఇప్పటికే హీరోయిన్లుగా పరిచయం అయ్యారు.

  అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం శివాత్మిక రాజశేఖరే అని చెప్పాలి. సినిమాల పరంగానే కాకుండా.. హాట్ ట్రీట్‌తోనూ ఈ భామ తెగ హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శివాత్మిక కొన్ని హాట్ సెల్ఫీలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

  అలా పరిచయం.. మంచి పేరు

  అలా పరిచయం.. మంచి పేరు


  జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురైన శివాత్మిక ‘దొరసాని' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. కానీ, ఈ చిత్రంలో శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలు విమర్శకులను ఆకట్టుకుని ఆమెకు పేరు తెచ్చాయి.

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  భారీ చిత్రంలో భాగమైన భామ

  భారీ చిత్రంలో భాగమైన భామ


  మొదటి చిత్రంలోనే ఆకట్టుకున్న శివాత్మిక రాజశేఖర్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ'లో భాగమైంది. ఇందులో శివాత్మిక వినూత్నంగా డిజైన్ చేసిన ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిసింది.

  వరుస సినిమాలతో హల్‌చల్

  వరుస సినిమాలతో హల్‌చల్


  అందం, అభినయంలో సత్తా చాటుతోన్న శివాత్మిక రాజశేఖర్ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ‘రంగమార్తాండ' షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సుందరాంగి.. ప్రస్తుతం ‘పంచతంత్రం' అనే సినిమా చేస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులూ ఫైనల్ చేసేసింది.

  అనుష్క శర్మ ఎద అందాల ఆరబోత: తల్లైనా తగ్గకుండా.. కోహ్లీ భార్యను ఇలా చూశారంటే!

  సినిమాలే కాదు... అవి కూడా

  సినిమాలే కాదు... అవి కూడా


  వరుస పెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న శివాత్మిక రాజశేఖర్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు తెలుగు, తమిళ చిత్రాలను ఒప్పుకుంటోంది.

  అక్కడ మాత్రం యాక్టివ్‌గానే

  అక్కడ మాత్రం యాక్టివ్‌గానే


  టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్నా.. శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడి ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది.

  Ashu Reddy: అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్.. అది తీసేసి చూపించు అంటూ దారుణంగా!

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్


  చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తోన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఘాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా అందరి దృష్టిలో పడడంతో పాటు ఇంటర్నెట్‌ను కూడా షేక్ చేసి పడేస్తోంది.

  Recommended Video

  Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
  హాట్ సెల్ఫీలు షేర్ చేసింది

  హాట్ సెల్ఫీలు షేర్ చేసింది


  యంగ్ హీరోయిన్, స్టార్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా కొన్ని హాట్ సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి షార్ట్ ధరించి తెగ ఫోజులు ఇచ్చేసింది. అంతేకాదు, ముందూ వెనుక అందాలను చూపిస్తూ కనిపించింది. ఫలితంగా వీటిని నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.

  English summary
  Actress Shivathmika Rajashekar Very Active in Social Media. Recently She Shared Workout Selfie in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X