ప్రియుడితో హీరో రాజశేఖర్ కూతురు లేచిపోయిందా? శివానిపై రూమర్ల వెనుక వాస్తవం ఏమిటి?

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తెలు ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారు హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి కూడా. అయితే అనుకోని పరిస్థితులలో రాజశేఖర్ కుమార్తె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది అంటూ ప్రచారం మొదలైంది.. దీంతో ఈ విషయం మీద రాజశేఖర్ కుమార్తెలలో చిన్న కుమార్తె అయిన శివాత్మిక క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

శివాని రాజశేఖర్

శివాని రాజశేఖర్

రాజశేఖర్ జీవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కుమార్తె పేరు శివాని రాజశేఖర్ కాగా ఆమె పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో అద్భుతం, WWW(ఎవరు ఎక్కడ ఎందుకు) లాంటి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో అన్భారివు అనే సినిమాలో కూడా నటించింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆమె ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోంది.

శివాత్మిక

శివాత్మిక

మరోపక్క రాజశేఖర్ జీవిత దంపతులు రెండో కుమార్తె శివాత్మిక తన అక్క కంటే ముందే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని సినిమాలో ఆమె హీరోయిన్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా ఒక తమిళ సినిమాలో నటించింది. కానీ ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే దక్కలేదు. ఆమె కూడా తన అక్క మాదిరిగానే క్రేజ్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది

బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది

అయితే ఎక్కడ మొదలైందో ఎలా మొదలైందో తెలియదు కానీ కొద్ది రోజుల నుంచి రాజశేఖర్ కుమార్తె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది అంటూ ఇబ్బందికర ప్రచారం మొదలైంది. అయితే ముందు ఈ విషయం మీద ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆ ప్రచారం అంతకంతకూ పెరిగి పోతూ ఉండడంతో ఎట్టకేలకు ఈ విషయం మీద శివాత్మిక స్పందించింది. ప్రస్తుతం తాను తన సోదరి శివాని అలాగే తన తండ్రి రాజశేఖర్ తల్లి జీవిత అందరం కలిసి దుబాయ్ వెకేషన్ లో ఉన్నామని చెప్పుకొచ్చింది.

ఆలోచించుకోవాలి అంటూ

ఆలోచించుకోవాలి అంటూ

నేను, అక్క ఇక్కడే ఉంటే మరి ఎవరు బాయ్ ఫ్రెండ్ తో పారిపోయారు? ఎక్కడికి పారిపోయారు? ఇలాంటి దుష్ప్రచారం చేసే ముందు అసలు ముందు వెనుక నిజాలు తెలుసుకోరా, ఇకమీదట ఇలాంటి విషయాలు ప్రచారం చేసే ముందు ఆలోచించుకోవాలి అంటూ ఆమె ఘాటు కామెంట్ చేసింది. అయితే అసలు ఇలా ప్రచారం మొదలు కావడానికి కారణం ఇటీవల శివాని రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్న ఒక వెబ్ సిరీస్ అని తెలుస్తోంది.

జాగ్రత్త వహించాలి

జాగ్రత్త వహించాలి

రాజ్ తరుణ్ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా ఇటీవల ఒక వెబ్ సిరీస్ లాంచ్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ ప్రకారం శివాని రాజశేఖర్ పెళ్లి పీటల మీద నుంచి బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయే పాత్రలో నటిస్తోంది. పెళ్లి కొడుకు పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. అలా పెళ్లి పీటల మీద బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది అనే స్టోరీ లైన్ తీసుకుని రాజశేఖర్ కుమార్తె లేచిపోయింది అంటూ కథనాలు వండి వడ్డించారు. దీంతో ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అని శివాత్మిక గడ్డి పెట్టింది అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X