Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఒకవైపు భజన పాట వింటూ మరోవైపు క్యాస్టింగ్ కౌచ్.. దోంగ నిర్మాత గుట్టు విప్పిన టెలివిజన్ నటి
ఇండస్ట్రీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా కొంతమంది నటీమణులు తరచుగా ఎదుర్కొనే ఇబ్బందుల్లో క్యాస్టింగ్ కౌచ్ ప్రధానమైనది అనే చెప్పాలి. ఇది వరకే చాలామంది ఈ విషయంపై నోరు విప్పి మాట్లాడడంతో అలా చేసేందుకు చాలావరకు భయపడుతున్నారు. ఇక మరికొందరి విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి మార్పు రాలేదని కూడా అనిపిస్తుంది. రీసెంట్ గా ఒక టెలివిజన్ నటి తనకు ఎదురైనా ఒక క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఓపెన్ గానే తెలియజేసింది. అతను ఎంత చెడ్డవాడు అంటే ఒకవైపు దేవుడి భక్తి భజన పాటలు వింటూనే మరొకవైపు క్యాస్టింగ్ గురించి మాట్లాడినట్లు ఆమె తెలియజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సీరియల్స్ ద్వారా గుర్తింపు
శివ్య పటానియా అనే టెలివిజన్ నటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైనా క్యాస్టింగ్ అనుభవం గురించి తెలియజేసింది. శివ్య టెలివిజన్ లోకి రాకముందు మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. హిమాచల్ ప్రదేశ్లో ఆమె ఫ్యాషన్ పోటీల్లో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక సోనీలో అప్పట్లో టెలికాస్ట్ అయినా కొన్ని ప్రముఖ సీరియల్స్ ద్వారా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది.

క్యాస్టింగ్ కౌచ్
హమ్‌సఫర్స్, ఆమె యే హై ఆషికి సీరియల్స్ లో ఆమె కీలకమైన క్యారెక్టర్స్ తో మెప్పించింది. అలాగే ఏక్ రిష్తా సాజెదారీ కా సీరియల్ ద్వారా కూడా ఆమె ప్రశంసలు అందుకుంది. మొదట్లోనే శివ్య పటానియా మంచి నటిగా గుర్తింపును అందుకోవడంతో ఆమెకు విభిన్నమైన రకాల సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఒక ప్రముఖ సీరియల్ లో ఆమె నటించడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ప్రత్యేకంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేసింది.

హోటల్ కు పిలిచాడు
శివ్య కేవలం టెలివిజన్ నటిగానే కాకుండా పలు రకాల ప్రైవేట్ యాడ్స్ లో కూడా నటించింది. అలాగే వెండితెరపై కూడా అవకాశాలు అందుకోవాలి అని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఒక సమయంలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉండగా ముంబై లో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇండస్ట్రీలో తాను ప్రముఖ నిర్మాత అంటూ ఒకసారి ఆడిషన్స్ కోసం ప్రత్యేకంగా తనను కలవాలి అని ఒక హోటల్ కు పిలిచినట్లుగా శ్రావ్య తెలిపింది.

అలా చేస్తే అవకాశాలు
అయితే ఆ హోటల్ కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి గదిలో కూర్చుని తనను అదేపనిగా చూస్తూ ఉన్నాడు. అయితే కొద్దిసేపటి అనంతరం అతను మెల్లగా తన మాటలతో నన్ను కమిట్మెంట్ అడిగేందుకు ప్రయత్నం చేశాడు. నువ్వు కమిట్మెంట్ ఇస్తే తప్పకుండా ఒక ప్రముఖ స్టార్ హీరో యాడ్ లో నటించే అవకాశం వస్తుంది అని ఆ తర్వాత కూడా చాలా అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చాడు అని శివ్య తెలియజేసింది.
Recommended Video


దేవుడి పాటలు వింటూ..
అయితే వెంటనే నేను ఆగ్రహం వ్యక్తం చేశాను. ఒకవైపు లాప్ టాప్ లో అప్పుడే అతను దేవుడికి సంబంధించిన భజన కీర్తనలను కూడా వింటున్నాడని దీంతో సిగ్గులేదా అంటూ అతడికి హెచ్చరిక చేసి అక్కడి నుంచి వచ్చేసినట్లుగా శివ్య వివరణ ఇచ్చింది. అంతేకాకుండా అతను నిర్మాతనే కాదు అంటూ అతను చెప్పిన బ్యానర్ పేరు కూడా ఎక్కడా లేదు అని ఆ తర్వాత తెలిసినట్లుగా శివ్య వివరణ ఇచ్చింది.