Sobitha: పెళ్ళై పది రోజులు కూడా కాలేదు.. అక్కినేనివారి కొత్త కోడలు డేరింగ్ స్టెప్ !
Sobitha Dhulipala Akkineni: అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాల వివాహ బంధంతో ఒకటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. అతి కొద్ది మంది బంధువులు సినీ సెలబ్రిటీల మధ్య అక్కినేని నాగ చైతన్య.. శోభిత మెడలో మూడు ముళ్ళు వేశారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే.. పెళ్లయిన పది రోజులు కాకుండా శోభిత నెట్టింట్లో ఓ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఆరునెలలుగా ఈ అమ్మడు పేరు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇండస్ట్రీలో కూడా మారుమోగుతోంది. వాస్తవానికి శోభితా అచ్చ తెలుగు అమ్మాయే. ఈ అమ్మడు టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. తొలుత రామన్ రాఘవ్ 2.0 చిత్రంలో హీరోయిన్ గా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఎన్నో హిట్ మూవీలలో నటించిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అడవి శేషు హీరోగా తెరకెక్కిన హిట్ 2 సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది అమ్మడు. మరోవైపు తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో కూడా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది శోభిత.

మరోవైపు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య ఓ వేడుకలో శోభితాతో పరిచయమైందట. ఆ పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు మీడియా కంట ఈ జంట పడిన ఈ విషయంలో క్లారిటీ రాలేదు. అంతలోపే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపి సీక్రెట్ గా నిశ్చితార్థం చేసి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అమ్మడు పేరు ట్రెండింగ్ మారింది. ఓవర్ నైట్ స్టార్ డమ్ తెంచుకుంది. ఏ ఊహించని పాపులరిటి సంపాదించుకుంది.
ఈ క్రమంలో డిసెంబర్ 4న నాగచైతన్య - శోభితలు ఎట్టకేలకు ఒకటయ్యారు.అన్నపూర్ణ స్టూడియోలో ఈ నెల 4 రాత్రి 8:13 నిమిషాలకు వీరి వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారి పెళ్లి కి సంబంధించిన అనేక వార్తలు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. త్వరలో నెట్ఫ్లిక్స్ లో వీరి పెళ్లిని స్ట్రీమింగ్ చేయనుంది.
ఇదిలా ఉంటే పెళ్లయి పది రోజులు కూడా కాలేదు. అప్పుడే శోభిత తన కెరీర్ విషయంలో ఓ డేరింగ్ స్టెప్ వేసింది. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. మరోవైపు.. ఫోటోషూట్ ల్లో కూడా పాల్గొంటుంది. తాజాగా ఓ ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బంగారు వర్ణపు చీరను కట్టుకొని తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా కనుల విందు చేస్తుంది శోభిత. అక్కినేని వారి వారసత్వం కొనసాగించేలా ఈ అమ్మడు కట్టుబొట్టు ఈ ఫోటో షూట్ లో ప్రతిబింబిస్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ ఫోటోషూట్ బ్యాక్ గ్రౌండ్ లో చార్మినార్ ఉండటం గమనించవచ్చు. అటు ఓల్డ్.. ఇటు నయా లూక్ తో అక్కినేని వారి కోడలు మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
అంతకు ముందు నాగ చైతన్య- శోభితల కొత్త జంట శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి లను దర్శించుకున్నారు. ఆ తరువాత ప్రత్యేకంగా స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సమయంలో అక్కినేని నాగార్జున దగ్గరుండి వారితో ప్రత్యేక పూజలు చేయించిన విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా శోభిత నాగచైతన్యల పెళ్లి గురించి వార్తలు చర్చనీయాంశంగా ఉంటున్నాయి.


Click it and Unblock the Notifications











