Sobhita Dhulipala: "ఆ ఒక్కటే కోరుకున్నా.. అందుకే చైతూతో సెట్ అయ్యా": శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Sobhita Dhulipala: బాలీవుడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత నెలలో అక్కినేని వారసుడు నాగచైతన్యతో శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో నిరాడంబరంగా జరిగింది. తర్వాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఆమె ప్రతి విషయం నెట్టింట్లో నెట్టింట్లో తెగవైరలవుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నిశ్చితార్థ వేడుకతో పాటు తన లైఫ్ లోని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
అక్కినేని వారసుడు నాగ చైతన్యతో శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగిన నాటి నుంచి ఆ అమ్మడు పేరు మారుమోగిపోతోంది. బాలీవుడ్ మూవీతో ఫేమస్ అయినప్పటికీ శోభిత తెలుగు అమ్మాయే. చిన్నప్పటి నుంచి శోభితకు కళలపై మక్కువ. దీంతో సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది. అలాగే.. స్నేహితుల ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇండియాలోకి ప్రముఖ మోడల్స్ ఒకరిగా పేరు తెచ్చుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ను సొంతం చేసుకుంది.

నటనపై ఇంట్రెస్ట్ తో ఈ అమ్మడు 2016లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇలా విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0'తో ఆమె నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే హిందీ చిత్రాల్లో నటించిన శోభిత.. అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శోభితా. అలాగే.. రామన్ రాఘవన్ 2.ఓ, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, మేజర్ సినిమాలతో పాపులారిటీ సంపాదించుకుంది. పలు హిందీ వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్, కల్కి చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించింది.
తాజాగా శోభిత ధూళిపాళ్ళ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్యతో జరిగిన ఎంగేజ్ మెంట్ పై తొలి స్పందించారు. తాను ఎప్పుడూ కూడా ఎంగేజ్ మెంట్ ను చాలా గ్రాండ్ గా చేసుకోవాలని అనుకోలేదనీ, ముందుగా ప్లాన్ లాంటిదేమీ చేసుకోలేదని అన్నారు. ఇలా జరగాలి అలా జరగాలనే కలలు కూడా తన కనలేదనీ, జీవితంలో అతి ముఖ్యమైన మధుర క్షణాలని ఆస్వాదించడంతో పాటు తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా వేడుక జరగాలని భావించానని పేర్కొన్నారు. కాబట్టే ఆ వేడుకను అంతా నిరాడంబరంగా జరుపుకున్నామని,కానీ, తన వరకు పర్ఫెక్ట్ పద్దతిలో జరిగిందని చెప్పుకొచ్చింది శోభిత.

శోభిత ఇంకా మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలి, పిల్లలుండాలని నేనెప్పుడూ అనుకునేదాన్ని. కానీ, మాతృత్వం అంటే నాకెంతో ఇష్టమనీ, తన తల్లిదండ్రులను, సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తానన్నారు. ఇవన్నీ ఎల్లప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటానని శోభిత పేర్కొన్నారు. తన భావాలు స్వతంత్రంగా ఉంటాయని, ఇప్పటివరకు తాను చేసిన పాత్రలు కూడా అలాంటివేనన్నారు. అందుకే తనపై అందరిలో తనని అందరూ ఇష్టపడుతారని అన్నారు. తాను ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్జైట్ గా ఫీల్ అవుతానని అన్నారు.
అలాగే.. తాను ఇతరుల ఈగోలను పట్టించుకోననీ, వాటి గురించి ఎప్పుడు ఆలోచించనన్నారు. మనకు ఏది మంచిదో.. ఏది చెడ్డదో మన మనసుకు తెలుసు. మనం ఎలాంటి వారితో బంధాలను ఏర్పచుకోవాలో సెట్ అయ్యే బంధాలను మాత్రమే కొనసాగిస్తాననీ అన్నారు. ఈ క్రమంలో తన మనసుకు ఎవరి నచ్చితే వారితోనే సెట్ అవుతాననీ, లేదంటే.. ఆ బంధాన్ని వెంటనే కాన్సిల్ చేసుకుంటానని అన్నారు. కేవలం రిలేషన్ షిప్ లోనే కాదు.. రొమాన్స్.. అలాగే.. ఫ్రెండ్ షిప్ లో కూడా అలాగే ఉంటా.. కొన్ని విషయాల్లో కొందరూ నచ్చుతారు. మరికొన్ని విషయాల్లో మనం వారికి నచ్చేకపోవచ్చు. మన నడుచుకునే తీరును బట్టి బంధాలు పటిష్టమవుతాయి' అంటూ తన రిలేషన్స్ స్టేటస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శోభితా.


Click it and Unblock the Notifications











