నాగచైతన్యతో పెళ్లి… ఆ విషయంలో సమంత ను మించి శోభితా ట్రెండ్ సెట్ చేస్తుందిగా..!

Shobitha - Naga Chaitanya Marriage: అక్కినేని నాగచైతన్య -హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం నేడు (డిసెంబర్‌ 4) వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహ ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. అతికొద్ది మంది కుటుంబ, సభ్యుల మధ్య వీరి వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. అయితే..ఈ సమయంలో హీరోయిన్ శోభితా దూళిపాళ్ల వస్త్రాలంకారణ, జ్యూవెలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభితా నగలు, వస్త్రాలంకారణపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నాగ చైతన్య, శోభితాలు మరికొన్ని గంటల్లో మూడుబంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత రెండు ఏండ్లుగా సీక్రెట్ గా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. తాను ముంబైలో జరిగిన ఓ పోటీకి ఈవెంట్లో శోభితాను తొలిసారి కలిశాననీ, ఆ మాటల్లోనే తన మంచి మనసు తనను కట్టిపడేసిందని, అలాగే.. తమ ఇద్దరి మధ్య ఎన్నో ఉమ్మడి పోలికలు ఉన్నాయని, ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని నాగ చైతన్య అన్నారు. శోభితా కుటుంబానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుందని తెలిపారు. అందుకే ఆమెతో కలిసి జీవితం పంచుకోవడం తనకు ఆనందంగా ఉందని నాగచైతన్య అన్నారు.

Shobitha - Naga Chaitanya Marriage Shobitha s jewellery are a special attraction

ఇక శోభితా తనకు కాబోయే నాగ చైతన్య గురించి చెబుతూ.. అతడు చాలా కూల్ గా కామ్ గా ఉంటాడని, ఆడంబరాలని ప్రదర్శించడని, అందరితో హుందాగా వ్యవహరిస్తుంటాడని, ఎంతో గౌరవం ఇస్తాడని, ఆ లక్షణాలే తనకు బాగా నచ్చాయని శోభిత వెల్లడించారు. వీరి వివాహం ఈ రోజు (డిసెంబర్ 4) రాత్రి 8:13 నిమిషాలకు జరగబోతుంది.ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబం ప్రత్యేకంగా భావించే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. అతికొద్ది మంది సినీ సెలబ్రెటీల నడుమ వీరి వివాహం జరుగబోతుంది.

ఇదెలా ఉంటే.. ఇప్పటికే నాగ చైతన్య, శోభితాల హాల్దీ సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. సంప్రదాయకట్టులో మెరిసిపోతూ మరింత అందంగా కనిపించారు. అయితే ఈ వివాహ వేడుకలు శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. సాంప్రదాయమైన దుస్తులను ధరించిన ఆ అమ్మడు మరింత అందంగా కనిపిస్తోంది. ఈ సమయంలో శోభిత వస్త్రాలంకరణ.. అలాగే.. జువెలరీపై చర్చ జరుగుతుంది.

Shobitha - Naga Chaitanya Marriage Shobitha s jewellery are a special attraction

శోభిత మంగళ స్నానాల సమయంలో గానీ, హాల్డీ సమయంలో గానీ, పెళ్లికూతురు చేసే సమయంలో గాని, ఆమె డ్రెస్సింగ్ గాని జువెలరీ గాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధానంగా ఆమె చీర కట్టు బ్రాహ్మణ సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపిస్తుంది. అలాగే.. ఆమె ఆభరణాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే.. ఆభరణాలు తన అమ్మమ్మ నుండి వారసత్వంగా వచ్చినవి టాక్ . సినిమాలలో బోల్డ్ గా కనిపించే శోభిత పెళ్లి సమయంలో మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏదేమైనా శోభిత కట్టుబొట్టు తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ విషయంలో మొత్తం శోభితా ట్రెండ్ సెట్ చేస్తుందిగా అంటు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: naga chaitanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X