వివాహం చేసుకోబోతున్న శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో.. వరుడు ఎవరంటే!
Recommended Video

వివాదాస్పద నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్టులతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంటారు. కొందరిని టార్గెట్‌గా చూసుకొని అసభ్యపు పదజాలంతో హడలెత్తిస్తుంటుంది. సినిమా పరిశ్రమలో వేధింపులను బయటపెడుతూ మీ టూ ఉద్యమాన్ని దక్షిణాదిలో విస్తృతం చేసిన ఈ నటి.. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ జరిగిందని ఓ పోస్టు పెట్టడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

నా ఎంగేజ్‌మెంట్ జరిగిందని
నా జీవితానికి ఓ తోడు దొరికింది. నాకు ఆస్ట్రేలియన్‌తో ఎంగేజ్ మెంట్ జరిగింది. నా ఎంగేజ్‌మెంట్ ఉంగరం ఇదే అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. దాంతో నెటిజన్లు అలర్ట్ అయి ఆ వార్త నిజమేనా అని ఆరా తీశారు. అంతలోనే మళ్లీ ఇతనే నా వరుడు అంటూ ఓ ఆస్ట్రేలియన్ ఫొటో పెట్టింది. దాంతో అంతా నిజమేనని అనుకొన్నారు.

వార్త నిజమేనని నమ్మారా?
అంతలోనే మరో పోస్టుతో శ్రీరెడ్డి తన పెళ్లి వార్తపై క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లి వార్త నిజమేనని అనుకొన్నారా? ఇండియన్స్ అంత ఈజీగా నమ్మరు. అవును ఈ రోజు ఏప్రిల్ 1 తేదీ. అందుకే మిమ్మల్ని ఫూల్ చేద్దామని అనుకొన్నాను. ఇందంతా ప్రాంక్ మాత్రమే. ఇంకా నేను సింగిల్‌గానే ఉన్నాను అని శ్రీరెడ్డి పోస్టులో వెల్లడించింది.

నాకు ఎవరూ లేరు.. సింగిల్‌గానే
ఒకరితో ప్రాంక్ చేయడానికి లేదా ప్రేమను కురిపించడానికి లేదా కోపం ప్రదర్శించడానికి ఎవరూ లేరు. నా ఎమోషన్స్ తెలియజేయడానికి నా ఫేస్‌బుక్ పేజ్ మాత్రమే ఉంది. నన్ను అర్ధం చేసుకొనే ప్రతీ ఒక్కరికి నా థాంక్స్ అని శ్రీరెడ్డి మరో పోస్టులో పేర్కొన్నది.

తమిళంలో అవకాశాల కోసం
గత కొద్దికాలంగా అనేక వివాదాల్లో శ్రీరెడ్డి కూరుకుపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం తమిళ భాషలో ఆఫర్లను వెతుకొంటన్నది. ఒకట్రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











