ఇండియన్, పాక్ ఆర్మీపై సాయి పల్లవి కామెంట్స్.. నెటిజన్లు దారుణంగా ట్రోల్స్

సౌత్ ఇండియా సినిమా దగ్గర పెద్దగా ఎలాంటి హడావుడి, హంగామా లేకుండా మంచి పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాచురల్ బ్యూటీ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అనే చెప్పాలి. కాగా సాయి పల్లవి హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లు కొట్టింది.

పైగా ఎలాంటి ఎక్స్ పోజింగ్ లు కూడా సాయి పల్లవి నుంచి లేకుండానే ఒక సెటిల్డ్ హీరోయిన్ గా ఐతే సౌత్ లో ముద్ర వేసుకుంది. అలాగే ఆమె అందం అభినయంతో పాటుగా ఆమె స్వభావం కూడా చూసి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. పైగా మిగతా హీరోయిన్స్ లా ఎప్పుడు పెద్దగా కాంట్రవర్సీ లలో కూడా సాయి పల్లవి కనిపించింది లేదు.

Shocker sai pallavi in unexpected controversy with Indian Army comments

తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్న సాయి పల్లవి చేసిన పలు షాకింగ్ కామెంట్స్ మాత్రం చర్చకు దారి తీశాయి. ఆమె మన భారత ఆర్మీ విషయంలో వేసిన కామెంట్స్ కాంట్రవర్సియల్ గా మారి షాకిస్తున్నాయి. కాగా ఆమె ఏమని వ్యాఖ్యానించింది అంటే భారత ఆర్మీ అలాగే పాకిస్తాన్ ఆర్మీ రెండు ఒకటే అంటూ ఆమె చేసిన పాత వీడియో ఇపుడు వైరల్ గా మారింది.

దీనితో ఇది చూసిన వారు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కాశ్మిర్ లో హిందువుల మారణహోమంని పశువులు స్మగ్లర్లు అంటూ కూడా చెప్పింది అని ఆమె సినిమాలు ఎవరూ చూడొద్దు, ఇలాంటి జ్ఞానం ఉన్న ఈమె ఇప్పుడు రామాయణం సినిమాలో 'సీత' గా నటిస్తుంది. అంటూ సడెన్ గా సాయి పల్లవిపై పాత వీడియో బయటకి తీసుకొచ్చారు.

కాగా ఈ వీడియోలో కామెంట్స్ లో కూడా సాయి పల్లవిపై తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఆమెకి మన దేశ చరిత్ర కోసం మినిమమ్ ఐడియా లేనట్టు ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో నార్త్ జనం మాత్రం ఇపుడు ఎందుకో సాయి పల్లవి విషయంలో నెగిటివ్ గానే ఉన్నట్టు కనిపిస్తున్నారు.

కాగా ఇంకోపక్క సాయి పల్లవి తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో భారీ సినిమా "తండేల్" లో నటిస్తుండగా దీనిని కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టన యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది సహా ఈమె బాలీవుడ్ సినిమా దగ్గర తన మొదటి సినిమా "రామాయణం" చేస్తుంది.

కాగా ఇందులో ఆమె సీతగా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రామునిగా నటిస్తున్నాడు ఆలాగే కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ విలన్ గా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాని దంగల్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇవి కాకుండా మరికొన్ని సినిమాల్లో సాయి పల్లవి పలు భాషల్లో నటిస్తుంది. అన్నట్టు ఆమె నటించిన మరో సినిమా "అమరన్" తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేసిన సినిమా ఈ దీపావళి కానుకగా విడుదలకి రాబోతుంది.

More from Filmibeat

Read more about: sai pallavi amaran ranbir kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X