రక్తం వచ్చేలా ముద్దు... హీరోయిన్ ఏడ్చినా ఆగని స్టార్ హీరో!

సినీ ఇండస్ట్రీలో కొన్ని సంఘటనలు కాలం గడిచినా మర్చిపోలేని వివాదాలుగానే నిలిచిపోతాయి. అలాంటి ఘటనల్లో ప్రముఖంగా చెప్పుకునేది 'దయావాన్' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కిస్సింగ్ సీన్ వివాదం. షూటింగ్‌లో కిస్సింగ్ సీన్ పేరుతో హద్దులు దాటి... హీరోయిన్‌కు గాయం అయ్యేలా ఓ స్టార్ హీరో ప్రవర్తించిన తీరు అప్పట్లో బాలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది. దర్శకుడు 'కట్' అన్నా ఆగకుండా ఆ నటుడు అతిగా ప్రవర్తించాడని వచ్చిన వార్తలు పెద్ద సంచలనంగా మారాయి. ఆ సీన్ తర్వాత హీరోయిన్ అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు ?

కెరీర్ ప్రారంభంలోనే చేదు అనుభవం
ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా, అగ్రనటి మాధురి దీక్షిత్. 1984లో 'అబోధ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మాధురి, తక్కువ కాలంలోనే తన అందం, నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కెరీర్ ప్రారంభ దశలోనే ఆమెకు 'దయావాన్' సినిమా రూపంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా 1987లో వచ్చిన కమల్ హాసన్ నటించిన 'నాయకన్'కి రీమేక్‌గా తెరకెక్కింది. దర్శకుడు ఫిరోజ్ ఖాన్ ఈ సినిమాను రూపొందించగా, వినోద్ ఖన్నా ప్రధాన పాత్ర పోషించారు.

Shocking Dayavan Controversy Vinod Khanna-Madhuri Dixit Kissing Scene That Sparked Outrage

షూటింగ్‌లో షాకింగ్ ఘటన
సినిమాలోని 'ఆజ్ ఫిర్ తుమ్ పే ప్యార్ ఆయా హై' పాట షూటింగ్ సమయంలో ఒక కిస్సింగ్ సీన్ తెరకెక్కించాల్సి వచ్చింది. అయితే షూటింగ్ సమయంలో వినోద్ ఖన్నా పాత్రలో పూర్తిగా లీనమై, దర్శకుడు 'కట్' అని చెప్పిన తర్వాత కూడా ఆగలేదట. అదే సమయంలో ఆయన మాధురి పెదవిని గట్టిగా కొరకడంతో రక్తం కారిందని, నొప్పితో మాధురి సెట్స్‌పైనే ఏడ్చినట్లు ప్రచారం. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారని, తర్వాత వినోద్ ఖన్నా మాధురికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఘటన మాధురిపై మానసికంగా ప్రభావం చూపిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

రిలీజ్ తర్వాత పెద్ద వివాదం

సినిమా విడుదలైన తర్వాత ఈ కిస్సింగ్ సీన్ భారీ వివాదానికి దారితీసింది. ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్లు కూడా వచ్చాయి. మాధురి స్వయంగా దర్శకుడు ఫిరోజ్ ఖాన్‌ను కలిసి ఆ సీన్ తీసేయాలని కోరినట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ దర్శకుడు మాత్రం ఆ సన్నివేశమే సినిమాకు కీలకం అని చెప్పి తొలగించలేదని తెలుస్తోంది. ఇంతేకాకుండా, ఆ సీన్‌ను సినిమాలో కొనసాగించేందుకు దర్శకుడు, హీరో కలిసి అదనంగా భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

కెరీర్‌పై ప్రభావం... కానీ స్టార్‌డమ్‌పై కాదు
ఈ వివాదం మాధురికి వ్యక్తిగతంగా బాధ కలిగించినప్పటికీ, ఆమె కెరీర్‌ను మాత్రం ఆపలేకపోయిందనే చెప్పాలి. తేజాబ్, దిల్, బేటా, హమ్ ఆప్కే హై కౌన్ వంటి సినిమాలతో ఆమె బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. 'ధక్ ధక్ గర్ల్'గా హిందీ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక గుర్తింపు పొందింది.అయితే ఈ ఘటన తర్వాత ఆమె బోల్డ్ సీన్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతారు. అప్పడప్పడూ ఈ ఘటన సినీ ప్రపంచంలో చర్చకు వస్తూనే ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X