అమ్మ బాబోయ్.. కాజల్ ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఆ హీరో మాత్రమే అతిథిగా

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెళ్లిళ్లు చాలా వేగంగా సింపుల్ గా జరిగిపోతున్నాయి. పెళ్లి అంటేనే పారిపోయే కొంతమంది హీరోలు కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా వివాహ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే కొంత ఆశ్చర్యం వేయక మానదు. అతిధులను పెద్దగా పిలవాల్సిన పని ఉండదని అనుకున్నారో లేక ముహూర్తం మంచిది అనుకుంటున్నారో గాని పెళ్లి మాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా చేసేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లికి సిద్దమైనట్లు టాక్ వస్తోంది.

కాజల్ ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

కాజల్ ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

కొన్నిసార్లు రూమర్స్ ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి అంటే నమ్మలేని విషయాలు కూడా కళ్ళముందు కనిపిస్తాయి. జరిగిపోయిన విషయాలను కూడా కొన్నిసార్లు అబద్ధాలు అనకుండా ఉండలేము. అంతగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. అయితే ఇటీవల కాజల్ అగర్వాల్ పై కూడా అలాంటి రూమర్స్ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయిందమే గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక..

ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక..

గతంలోనే కాజల్ అగర్వాల్ ఒక బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకోనుందనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఆ విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికి చాలా ఇంటర్వ్యూలలో ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని కాజల్ వివరణ ఇచ్చింది. ఇక మొన్నటి వరకు రెగ్యులర్ గా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న కాజల్ లాక్ డౌన్ అనంతరం ఇంట్లో వల్ల ఒత్తిడికి పెళ్లికి సిద్ధమైందనే రూమర్స్ వస్తున్నాయి.

ఆ హీరో ముఖ్య అతిథిగా..

ఆ హీరో ముఖ్య అతిథిగా..

రీసెంట్ గా కాజల్ నిశ్చితార్థం వేడుక చాలా సింపుల్ గా జరిగిందని కొన్ని కోలీవుడ్ మీడియాలలో రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఆ వేడుకకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ రూమర్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. దీంతో కాజల్ ఫ్యాన్స్ కొంత కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు.

పెళ్లి కొడుకు పేరు అదేనా..

పెళ్లి కొడుకు పేరు అదేనా..

అమ్మ బాబోయ్ ఈ రూమర్ నమ్మేలా ఉందా? అని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరొక షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే.. కాజల్ సెలక్ట్ చేసుకున్న అబ్బాయి పేరు గౌతమ్ అని కూడా టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని గతంలో ఇలాంటి రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా కాజల్ పెద్దగా స్పందించలేదు. మరి ఇప్పుడైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

Recommended Video

Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
సినిమాలతో బిజీ కావడం వలన..

సినిమాలతో బిజీ కావడం వలన..

అసలైతే గత ఏడాది మొదట్లోనే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ ఊహించని విధంగా ఆఫర్స్ రావడంతో మైండ్ మార్చుకుందని టాక్ వచ్చింది. బాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తుండడంతో అమ్మడు పెళ్లి విషయాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టిందట. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తమిళ్, తెలుగులో కాజల్ సేఫ్ జోన్ లో ఛాన్సులు అందుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X