Rashmika Mandanna ప్రేమతో ముద్దు పెట్టినా వివాదమేనే.. మరీ ఇంత దారుణంగా కామెంట్ చేస్తారా?
రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకొని, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేధికగా కూడా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుందీ ముద్దుగుమ్మ. నేషనల్ క్రష్ గా మారిన తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ షోను మరింత పెంచింది. బాలీవుడ్ బ్యూటీస్ కి ఏమాత్రం తగ్గకుండా రచ్చ చేస్తోంది.
వెస్టర్న్, మోడ్రన్, ట్రెడిషనల్.. ఎలాంటి డ్రెస్సు వేసినా.. తన నడుము అందాలను, ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేధికగా ఓ పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటో కాస్త ప్రస్తుతం ట్రోలింగ్ కు దారి తీసింది. చాలా మంది రష్మికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె పరువు తీయడమే లక్ష్యం ఏమో అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు.

అయితే ఆమె ఇటీవలే పౌట్ పెడుతూ ఓ ఫొటో దిగింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ఐ డోంట్ నో హౌ టు పౌట్, సో ఎ స్ట్రెయిట్ ఔట్ కిస్సీ ఇట్ ఇస్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇందులో క్రష్మిక చాలా అందంగా కనిపిస్తోంది. కానీ ఆమె మూతిపై కాస్త మీసాలు, గడ్డం వచ్చినట్లు కనిపిస్తోందని... నెటిజెన్లు విపరీతంగా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.
మీ దవడ చుట్టూ గడ్డం పెరిగిందని కొందరు, మీకు మీసాలు వచ్చాయి మేడం అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ముందు వాటిని క్లీన్ చేసుకొని ఫొటోలు దిగమంటూ మరికొంత మంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. నిజమైన రష్మిక అభిమానులు మాత్రం.. మీరు చాలా అందంగా ఉన్నారు, మీ అందం వర్ణించలేనిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ కామెంట్లపై రష్మిక స్పందించలేదు.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో నటిస్తూ బిజీగా ఉంది. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్న యానిమల్ మూవీలో రష్మిక చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఓకే చేసింది నేషనల్ క్రష్. బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు చేసినా వాటితో అంతగా పేరేమీ రాలేదు. బాలీవుడ్ బ్యూటీస్ కు ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫోటోలు పెట్టేస్తోంది. అలా బాలీవుడ్ మూవీ మేకర్స్ కంట్లో పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











