దారుణంగా యువ నటి మృతి.. ఎట్టకేలకు బయటపడ్డ శవం.. షాకింగ్ విషయమేమిటంటే?
పాకిస్థాన్ యువ నటి హుమైరా అస్గర్ మృతి కేసులో షాకింగ్ అంశాలు బయటకు వస్తున్నాయి. తాను నివసిస్తున్న ఇంటి నుంచి ఆమె కుళ్లిపోయిన బాడీని కరాచీ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అయితే వారు ప్రాథమిక తనిఖీలు, పరీక్షల అనంతరం ఆమె బాడీ 8 రోజుల క్రితం చనిపోయిందని అనుకొన్నారు. కానీ ఆమె మరణం విషయంలో పోలీసులు, వైద్యులు నివ్వెరపొయేలా చేశాయి. హుమైనా ఆస్గర్ ఆలీ మృతి విషయంలో వెలుగు చూసిన విషయాల వివరాల్లోకి వెళితే..
కరాచీలో ఢిఫెన్స్ హౌసింగ్ అథారిటీలోని అపార్ట్‌మెంట్‌లో హుమైరా నివసిస్తున్నారు. 2024 నుంచి ఆమె అద్దె చెల్లించడం లేదు. ఆమె ఇంటిలో ఉండటం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదుతో ఆ ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇంటిలోపలి నుంచి డోర్స్ లాక్ చేసి ఉండటంతో తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లారు. అయితే ఆమె తన పడక గదిలో విపరీతంగా కుళ్లిన స్థితిలో కనిపించింది. దాంతో పోలీసులు పంచనామా చేసి ఆమె దేహాన్ని పోస్టు మార్టంకు పంపారు.

అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. ఆమె దేహాన్ని స్వాధీనం చేసుకొన్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆమె మరణించి కనీసం రెండు వారాలు అయి ఉంటుంది. లోకల్ కోర్టు ఆదేశాల మేరకు ఇంటిని ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులు డోర్‌ను కొట్టారు. అయితే లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపులు ధ్వంసం చేసి వెళితే..ఆమె దేహం కనిపించింది. ఆమె దేహాన్ని పోస్టుమార్టంకు పంపించా అని చెప్పారు.
అయితే హుమైరా దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అనంతరం మీడియాతోను, పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆమె వారం, 8 రోజుల క్రితం మరణించలేదు. కనీసం 6 నుంచి 9 నెలల మధ్య మరణించి ఉంటారు. శరీరం బాగా కుళ్లిపోవడంతో ఆమె చేయి దేహం నుంచి వేరుపడింది. కాళ్లు, మోకాళ్లు దారుణంగా మారాయి అని చెప్పారు.
అయితే ఆమె గురించి ఇరుగుపొరుగు వాళ్లను ఆరా తీయగా.. 2024 సెప్టెంబర్‌లో కనిపించింది. ఆ తర్వాత హుమైరా జాడ కనిపించలేదు అని చెప్పారు. అయితే పోలీసులు ఆమె వస్తువులు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. మొబైల్‌లో ఆమె చేసిన చివరి కాల్ మాత్రం సెప్టెంబర్ 2024లోనే ఉందనే విషయం బయటపడింది. దాంతో ఆమె మరణం దాదాపు 9 నెలలకుపై బడే ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు.
పాకిస్థాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హుమైరా అస్గర్ ఆలీ పాపులర్ సెలబ్రిటీగా గుర్తింపు పొందారు. ఏఆర్‌వై డిజిటల్‌లో ప్రసారమైన తమాషా రియాలిటీ షో ద్వారా అత్యంత పాపులారిటీ సంపాదించుకొన్నారు. పాకిస్థాన్ బుల్లితెర మీద ఎహసాన్ ఫారామోష్, గురు లాంటి సీరియల్స్ నటించారు. ముక్కుసూటిగా, బోల్డుగా మాట్లాడటం తీరు కారణంగా ఆమె లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో 714K ఫాలోవర్స్ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











