Shraddha Das: జిమ్ లోనూ శ్రద్ధా దాస్ హాట్ షో.. చెమటతో అందాల ఆరబోత
అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటి శ్రద్ధా దాస్. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ మూవీ ఆర్య 2లో శాంతిగా ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అర్థం చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా అందాలు ఆరబోస్తూ హీట్ పెంచుతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

అర్థం చిత్రంతో మళ్లీ..
సినిమాలకు దూరమై మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ముందుకు రాబోతుంది శ్రద్ధా దాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరిసిన శ్రద్ధా దాస్ తాజాగా అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

పురులియా నుంచి ముంబైకి..
ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త. దీంతో శ్రద్ధా దాస్ కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. నటిగా పాపులర్ అవుదామని చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగులో 2008లో విడుదలైన అల్లరి నరేష్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్ చిత్రసీలోకి అడుగు పెట్టింది ఈ ముంబై భామ శ్రద్ధా దాస్.

ఆర్య 2 చిత్రంతో గుర్తింపు..
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం మూవీలో ప్రధాన హీరోయిన్ మంజరి ఫడ్నవీస్‌తో పాటు మరో సెకండ్ హీరోయిన్గా నటించింది. అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చిన కానీ శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. అల్లరి నరేష్ సినిమా తర్వాతి సంవత్సరం 2009లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్, నవదీప్ కాంబినేషన్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య 2 విడుదలైంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో..
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్యు 2 సినిమాలో శాంతి పాత్రలో ఆర్యను ఇష్టపడే కొలిగ్ గా శ్రద్ధా దాస్ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆర్య 2 సినిమాతో తెలుగులో శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్.

బికినీలో హాట్ గా..
తాప్సీ హీరోయిన్ గా నటించిన మొగుడు చిత్రంలో సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను తన హాట్ నెస్ తో ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్. అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు మూవీ అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి.

జిమ్ లో మరింత హాట్ గా..
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. చీరకట్టిన, బికినీ వేసినా ఏ డ్రెస్ లో అయినా తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా జిమ్ లో దిగిన పిక్ లో చెమటలతో తన అందాలను ఆరబోసి.. సోషల్ మీడియాలోకి వదిలింది ఈ హాట్ భామ. ఈ పిక్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చి హైలెట్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











