Shraddha Das: ఆరెంజ్ చీరలో శ్రద్ధా దాస్ అందాల జాతర.. ఓ రేంజ్ లో ఫొటోలు

అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. అలాంటి వారిలో సూపర్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఒకరు. తన అందం, చందంతో యూత్ మనసులను కొల్లగొట్టింది ఈ భామ. అయితే శ్రద్ధా దాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఒకటి రెండు పాత్రలతో పేరు తెచ్చుకున్నప్పటికి ఒక నటిగా అసంతృప్తిగానే ఉంది ఈ భామ. ఇక ఈసారి మాత్రం అర్థం మూవీతో మళ్లీ తానేంటే నిరూపించుకునేందుకు రాబోతుంది శ్రద్ధా దాస్. ఇదిలా ఉంటే సినిమాల ద్వారా సక్సెస్ కానీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో విపరీతమైన క్రేజ్ అందుకుంది.

జర్నలిజంలో డిగ్రీ..

జర్నలిజంలో డిగ్రీ..

ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త. దీంతో శ్రద్ధా దాస్ కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

అల్లరి నరేష్ మూవీతో తెరగేట్రం..

అల్లరి నరేష్ మూవీతో తెరగేట్రం..

నటిగా పాపులర్ అవుదామని చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగులో 2008లో విడుదలైన అల్లరి నరేష్ సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​ చిత్రసీలోకి అడుగు పెట్టింది ఈ ముంబై భామ శ్రద్ధా దాస్. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో సెకండ్ హీరోయిన్​గా నటించింది. అయితే సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన కానీ శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు.

ఆర్య 2లో శాంతిగా..

ఆర్య 2లో శాంతిగా..

అల్లరి నరేష్ సినిమా తర్వాతి సంవత్సరం 2009లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్, నవదీప్ కాంబినేషన్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య 2 విడుదలైంది. ఈ సినిమాలో శాంతి పాత్రలో ఆర్యను ఇష్టపడే కొలిగ్ గా శ్రద్ధా దాస్ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది.

 బికినీ వేసి హాట్ గా..

బికినీ వేసి హాట్ గా..

ఆర్య 2 సినిమాతో తెలుగులో శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. ఈ తాప్సీ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను తన హాట్ నెస్ తో ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్.

హాట్ గా ప్రదర్శిచిన తీరు..

హాట్ గా ప్రదర్శిచిన తీరు..


అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు మూవీ అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి. దీంతో కొద్దిరోజుల పాటు తెలుగు బుల్లితెరపై తన బ్యూటిఫుల్ నవ్వుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

సక్సెస్ తెస్తుందో..

సక్సెస్ తెస్తుందో..

ప్రస్తుతం అర్థం అనే ఓ లేడి ఒరియెంటెడ్ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమా అయినా ఆమెకు సక్సెస్ తెస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిన్నది సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికే అనేక హాట్ ఫొటోలు, పోజులతో కుర్రకారు గుండెలకు గాయాలు చేసిన ఈ భామ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది.

ఆరెంజ్ సారీలో..

ఆరెంజ్ సారీలో..


బ్లాక్ స్లీవ్ లెస్ బ్లౌస్.. ఆరెంజ్ సారీలో శ్రద్ధా దాస్ తన అందాలను ప్రదర్శించిన తీరు యూత్ ను ఆకట్టుకుంటోంది. ఈ సారీలో శ్రద్ధా తన ఎద అందాలను చాలా శ్రద్ధగా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X