శ్రద్ధా దాస్ అరాచకం .. బ్లూ కలర్ డ్రెస్‌లో ఎద అందాలు దాచి విరహంతో సెగలు
అందం , అభినయం ఉన్నా.. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్నా పలువురు ముద్దుగుమ్మలు ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోతున్నారు. ఈ కోవలోకే వస్తారు శ్రద్ధా దాస్. దాదాపు 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఈమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. కానీ పట్టువదలకుండా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు శ్రద్ధ. వైట్ స్కిన్ టోన్‌తో, మెస్మరైజింగ్ లుక్‌లో ఉండే శ్రద్ధ తన అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా బెంగాల్‌లోని పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ చేశారు. 2008లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్‌తో పాటు మరో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడ వేగ వంటి పలు సినిమాల్లో శ్రద్ధా దాస్ నటించారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంతగా అందాలు ఆరబోసినా సరైన అవకాశాలు రావట్లేదు ఈ ముద్దుగుమ్మకి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 మూవీతో పాపులారిటీ సంపాదించుకుంది శ్రద్ధా దాస్. మళ్లీ ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే మరో సినిమా ఈ బెంగాలీ బ్యూటీకి పడలేదు.
అప్పట్లో నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను అలరించారు శ్రద్ధా దాస్. బందిపోటు, హిప్పీ తదితర సినిమాల్లో గెస్ట్ రోల్‌లోనూ ఆమె కనిపించారు. తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌లో ఈటీవీలో ప్రసారమైన డ్యాన్స్ షో డీ 15కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు శ్రద్ధ దగ్గరయ్యారు. ఈ ఏడాది పారిజాత పర్వంలో అనే సినిమాలో నటించారు శ్రద్ధా దాస్. కిడ్నాప్ ఇతివృత్తంతో సంతోశ్ కంభంపాటి రూపొందించిన ఈ సినిమాలో ఆమె నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం అర్ధం అనే తెలుగు సినిమాలో శ్రద్ధా దాస్ నటిస్తున్నారు.

సినిమా అవకాశాలు రాకపోయినా.. ఎప్పటికప్పుడు హాట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోషూట్లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్. సోషల్ మీడియాలో ఈమెకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో చేసిన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ చూసేయ్యండి.


Click it and Unblock the Notifications











