శ్రద్ధాదాస్ జలకలాటలు.. బాత్రూమ్ ఫోటోలతో కుర్రకారు బేజారు
అందం , అభినయంతో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్నా పలువురు ముద్దుగుమ్మలు ఎందుకో వెండితెరపై స్టార్‌డమ్ దక్కించుకోలేకపోతున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాస్. దాదాపు 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇప్పటికీ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు శ్రద్ధా దాస్ . హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాల కోసం నేటికీ ట్రై చేస్తూనే ఉన్నారు శ్రద్ధ.
1987 మార్చి 4న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా వీరి స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని పురులియా. వ్యాపార రీత్యా శ్రద్ధ కుటుంబం ముంబైకి వచ్చి స్థిరపడింది. ప్రతిష్టాత్మక ముంబై విశ్వవిద్యాలయం నంచి మీడియాలో డిగ్రీ చేశారు శ్రద్ధా దాస్. 2008లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు వారిని పలకరించింది శ్రద్ధ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్‌తో పాటు సెకండ్ హీరోయిన్గా తన అందాలతో ఆకట్టుకుంది.

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తర్వాత డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడ వేగ వంటి పలు సినిమాల్లో శ్రద్ధా దాస్ నటించారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంతగా అందాలు ఆరబోసినా సరే ఆమెకు మాత్రం స్టార్ డమ్ దక్కలేదు. అప్పట్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 మూవీతో గాడిలో పడింది అనిపించుకున్నా తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది.
అవకాశాలు రాకపోవడంతో చివరికి స్పెషల్ సాంగ్స్ చేసేందుకు కూడా శ్రద్ధా దాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను అలరించారు శ్రద్ధా దాస్. బందిపోటు, హిప్పీ తదితర సినిమాల్లో గెస్ట్ రోల్‌లోనూ తళుక్కున మెరిశారు. తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమైన డ్యాన్స్ షో డీ 15కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు శ్రద్ధా దాస్ దగ్గరయ్యారు. ఈ ఏడాది పారిజాత పర్వంలో అనే సినిమాలో నటించారు శ్రద్ధా దాస్. ప్రస్తుతం అర్ధం అనే తెలుగు సినిమాలో ఆమె నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ శ్రద్ధా దాస్ నటించారు. 40కి చేరువ అవుతున్న ఇంకా 16 ఏళ్ల అమ్మాయిలాగే అందాలను మెయింటైన్ చేస్తూ అప్‌కమింగ్ బ్యూటీలకు పోటీ ఇస్తోంది.
సినిమా అవకాశాలు రాకపోయినా.. ఎప్పటికప్పుడు హాట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోషూట్లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్. సోషల్ మీడియాలో ఈమెకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ వేసి నడుము, ఎద అందాలను చూపెడుతూ ఓపెన్ బాత్‌రూంలో షవర్ కింద జలకాలు ఆడిన ఫోటోలను శ్రద్ధా దాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తడి అందాలతో ఉన్న ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా శ్రద్ధ అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











