twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ ఆఫీసులో.. ఏంటీ హీరోయిన్ రచ్చ! ఇంతకీ ఏం మెసేజ్ ఇస్తున్నట్లు..?

    |

    టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆధునికతకు తగ్గట్టుగా సినిమాలు చేసే పనిలో పడుతున్నారు మేకర్స్. అందుకే క్రమంగా వెబ్ సిరీస్‌ల హంగామా ఎక్కువైపోతోంది. ప్రేక్షకులు వెబ్ సిరీస్‌ చూడటానికి ఆసక్తి చూపుతుండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక హీరోయిన్స్ అయితే వెబ్ సిరీస్ అనగానే సై సై అనేస్తున్నారు.

    ఇప్పటికే ఈ లిస్టులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చేరిపోయిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించింది కియారా. ఇక ఇదే దారిలో అక్కినేని సమంత, కాజల్ అగర్వాల్ కూడా చేరారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ అతి త్వరలో వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే వెండితెర అందాల విందిచ్చే శ్రద్దా దాస్ ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. దాని పేరే 'ఈ ఆఫీసులో..'.

    Shraddha Das Shares a Sensational photo in Social media

    గత కొంతకాలంగా 'ఈ ఆఫీసులో..' వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్న శ్రద్దా దాస్ తన షూటింగ్ పార్ట్ గురించి పేర్కొంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ మేరకు అందాల విందు చేస్తూ గ్రీన్ కలర్ సారీలో దిగిన పిక్స్ షేర్ చేసింది. ఈ రకంగా మరోసారి తన అందాలకు పదును పెట్టింది శ్రద్దా. దీంతో 'ఈ ఆఫీసులో' అంటోంది.. మరి ఇంత హాట్‌గా కనిపిస్తోందేంటి? కొంపదీసి ఆఫీసులోనే ఇలా రచ్చ చేస్తుందా ఏంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మొత్తానికైతే తన వెబ్ సిరీస్ వెరీ వెరీ హాట్ అని చెప్పకనే చెప్పేసింది శ్రద్దా దాస్.

    English summary
    Tollywood heroine Shraddha Das now doing a web series which is named as 'ee officelo'. Now she shares a sensational hot pic in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X