ఎన్నిసార్లు తప్పుచేసినా కూడా.. అలా చేస్తేనే నాకు హ్యాపీ.. సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రభాస్ సాహో చిత్రంతో దక్షిణాదినా ఫేమస్ అయింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అమృతా నాయర్ క్యారెక్టర్‌లో శ్రద్దా కపూర్ అదరగొట్టేసింది. తన గ్లామర్‌తో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే మరోసారి దక్షిణాది ప్రేక్షకులను పలకరిస్తుందో లేదో చెప్పలేం కానీ.. ఆమెకు మాత్రం భారీ ఫాలోయింగ్ ఏర్పడిందని మాత్రం చెప్పగలం. బాలీవుడ్‌లో క్షణం తీరిక లేకుండా గడిపే ఈ భామ.. ప్రస్తుతం క్వారంటైన్‌ను బాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

తారలంతా ఇంట్లోనే..
కరోనా వచ్చి సెలెబ్రిటీలనంతా ఇంటి పట్టునే ఉండేలా చేసింది. రోజుకో దేశంలో ఉంటూ క్షణం కూడా వృథా చేయకుండా గడిపే సెలెబ్రిటీలను ఇంటికే పరిమితం చేసింది కరోనా వైరస్. అయితే ఇలా దొరికిన సమయాన్ని కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొంత మంది తెగ ఫీలైపోతున్నారు.

ప్రతిభకు పని చెబుతూ..
లాక్ డౌన్‌లో కొందరు హీరోయిన్స్ పెయింటింగ్ వేస్తూ ఉంటే.. మరికొంత మంది వంటింట్లో చేరి కొత్త రుచులను కనిపెడుతున్నారు. ఇంకొంత మంది ఎప్పటిలానే తమ ఫిట్‌నెస్ శ్రద్ద పెడుతూ వర్కౌట్లు, యోగాలు, వ్యాయమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.

శ్రద్దా కపూర్ సైతం..
ఆషికీ 2 చిత్రంతో పరిచయం అయిన శ్రద్దా కపూర్ ఆపై డ్యాన్స్ ప్రధాన చిత్రాల్లో నటించి తన సత్తాను చాటుకుంది. ఏబీసీడీ, ఏబీసీడీ 2 చిత్రాల్లో తన డ్యాన్సులతో అదరగొట్టేసింది. తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమోనన్న సంగతి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
Recommended Video
డ్యాన్స్ చేస్తేనే హ్యాపీ..
తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో చెబుతూ.. నేను ఎక్కువ ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం డ్యాన్స్. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఎన్ని తప్పులు చేసినా పర్లేదు.. ఎలాంటి కష్టమైన స్టెప్ అయినా పర్లేదు.. డ్యాన్స్ చేస్తే నేను సంతోషంగా ఉంటాను.. నాకు డ్యాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్స్‌కు, డ్యాన్సర్లకు థ్యాంక్స్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











