Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్‌పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సాహో’ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మందుకొట్టి దొరికిపోయారట!
ప్రస్తత జనరేషన్లో యువత పార్టీలకు వెళ్లడం, పార్టీ కల్చర్‌లో భాగంగా స్నేహితులతో కలిసి కాస్త వైన్, వోడ్కా లాంటివి తీసుకోవడం సర్వసాధారణమే. అయితే ఇలాంటివి లైఫ్‌లో ఫస్ట్ టైమ్ తీసుకున్నపుడు ఎక్కడో తెలియని భయం, ఇంట్లో తెలిసిపోతుందనే కంగారు ఉంటుంది. ఆ కంగారే మనల్ని పట్టించేస్తోంది. 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్‌కు అలాంటి అనుభవమే ఎదురైందట.
'సాహో' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్దా కపూర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నారని, లైఫ్‌లో మొదటిసారి మందు కొట్టి ఇంటికి వెళ్లినపుడు అమ్మకు దొరికిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా తన కోస్టార్ ప్రభాస్ మీద శ్రద్ధా కపూర్ ప్రశంసలు గుప్పించారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినపుడు తనను ఎంతో బాగా చూసుకున్నారని, ప్రతి రోజు వారి ఇంటి నాకోసం ప్రత్యేకంగా ఫుడ్ ప్రిపేర్ చేయించి తీసుకొచ్చేవారని తెలిపారు. ప్రభాస్‌తో పాటు చిత్ర బృందం నన్ను ఎంతో బాగా చూసుకున్నారు కాబట్టే రెండేళ్లైనా ఎలాంటి విసుగులేకుండా షూటింగ్ చేయగలిగినట్లు తెలిపారు.
'సాహో' మూవీ విషయానికొస్తే.... సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను అబ్బుర పరచబోతోంది.