twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదట.. సాహో దెబ్బకు మనసు మార్చుకున్న శ్రద్దా కపూర్

    |

    భారీ అంచనాలతో విడుదలైన సాహో సినిమా ఆశించినంతగా సక్సెస్ కాకపోవడంతో చిత్ర యూనిట్ పై తీవ్ర ప్రభావమే చూపించింది. నార్త్ లో పరవాలేదనిపించినప్పటికి సౌత్ లో మాత్రం సినిమా ఊహించని రిజల్ట్ ని అందుకుంది. ప్రభాస్ క్రేజ్ కూడా కొన్ని ఏరియాల్లో పెద్దగా ఉపయోగపడలేదు. మెయిన్ గా ఈ సినిమాపై అందరికంటే ఎక్కువగా హీరోయిన్ శ్రద్దా కపూర్ ఆశలు పెట్టుకుంది. ఆ రిజల్ట్ కి అమ్మడు తెలుగు ఆఫర్స్ కి దూరంగానే ఉన్నట్లు టాక్ వచ్చింది.

    Recommended Video

    Shraddha Kapoor Thinking About Telugu Offers After Saaho Result
    అంచనాలే బెడిసికొట్టాయి..

    అంచనాలే బెడిసికొట్టాయి..

    బాహుబలి చాలా వరకు ఆడియెన్స్ అంచనాలను అందుకోగలిగింది. ఓ వర్గం ఆడియెన్స్ నుంచి విమర్శలు వచ్చినా కూడా కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం పడలేదు. అదే తరహాలో సాహో కూడా సక్సెస్ అవుతుందని శ్రద్దా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా అభిమానులకు కొన్ని విషయాల్లో చిరాకు తెప్పించింది.

    శ్రద్దా కపూర్ నాట్ హ్యాపీ..

    శ్రద్దా కపూర్ నాట్ హ్యాపీ..

    సౌత్ ఇండస్ట్రీలో ఒక పాన్ ఇండియా సినిమాతో తన క్రేజ్ ని మరీంత పెంచుకోవాలని అనుకున్న ఈ బ్యూటీకి సాహో సినిమా నీరాశపరిచింది. ఆ తరువాత సౌత్ నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా అమ్మడు ఒప్పుకోలేదట. ఇక నుంచి బిగ్ బడ్జెట్ సినిమాలను పట్టించుకోకుండా సినిమాలో మ్యాటర్ ఉందా లేదా అనే విషయం గురించి మాత్రమే ఆలోచించాలని పలు కమర్షియల్ సినిమాలను రిజెక్ట్ చేసిందట.

     రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదు..

    రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదు..

    తెలుగులో మంచి సినిమాలు వస్తే చేయడానికి ఏ మాత్రం ఇబ్బంది లేదని ఒక క్లారిటీ ఇచ్చిన శ్రద్దా రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోందట. తన క్రేజ్ మరింత పెరగాలని కొన్ని విషయాల్లో వెనుకడుగు వేస్తోందట. పాత్రకు ప్రాధాన్యం ఉంటే మంచి ఆఫర్ వస్తే గనక ఎంత బిజీగా ఉన్న టాలీవుడ్ కి వస్తానని చెబుతోంది.

    ఆ రూమర్స్ లో నిజం లేదు..

    ఆ రూమర్స్ లో నిజం లేదు..

    ఇక శ్రద్దా కపూర్ సాహో సినిమా తరువాత తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం ఆమె రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వకపోవడమేనని టాక్ వచ్చింది. గత ఏడాది నుంచి శ్రద్దాకి టాలీవుడ్ నుంచి ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. కానీ ఆమె హీరోల రేంఙ్ లో డిమాండ్ చేస్తుండడం వల్లే నిర్మాతలు ఆమె దగ్గరకు వెళ్లడం లేదట. ఈ న్యూస్ బాలీవుడ్ అంతా వైరల్ కావడంతో వెంటనే ఆమె సన్నిహితులు అలాంటిదేమి లేదని కేవలం కథలు నచ్చకనే ఒప్పుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.

    English summary
    In the South, saaho film received an unexpected result in the South, though it was not a good deal. Prabhas Craze was also not very helpful in some areas. The heroine Shraddha Kapoor hopes for the film as the main. Talk about the sale of the Result to Telugu Offers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X