బాయ్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా శ్రద్ధాకపూర్? ప్రియుడితో పబ్లిక్‌గా చిలిపి పనులు చేస్తూ

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ నటీనటులంతా ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్‌ కార్డ్ ప్రకటిస్తూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కొందరు ఇప్పటికీ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తూ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కోవలోకే వస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్... 40కి చేరువ అవుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లిమాట ఎత్తడం లేదు. అయితే ఓ ప్రముఖ వ్యక్తితో శ్రద్ధా కపూర్ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రద్ధాకపూర్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...

కష్టంతో స్టార్ హీరోయిన్‌గా
బాలీవుడ్ విలక్షణ నటుడు శక్తికపూర్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు శ్రద్ధాకపూర్. తొలుత కొన్ని ఫెయిల్యూర్స్ పలకరించినప్పటికీ కష్టపడి బాలీవుడ్‌లో లీడింగ్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఈ దశలో ఆషికీ 2తో శ్రద్ధా కపూర్ బ్రేక్ అందుకున్నారు. ఇందులో ఆమె అందం, నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. హైదర్, ఏక్‌విలన్, ఏబీసీడీ 2, భాఘీ, సాహో, స్త్రీ 2 వంటి సినిమాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు శ్రద్ధా కపూర్. నటిగానే కాకుండా సింగర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగానే కాకుండా ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీ 100లో పలుమార్లు నిలిచారు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ఈథ అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు.

Shraddha Kapoor and Rahul Mody caught at Mumbai Coffee Festival

పలువురితో శ్రద్ధ డేటింగ్
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 15 ఏళ్లు కావొస్తుండగా.. కెరీర్‌లో పలువురితో ప్రేమాయణాలు సాగించింది శ్రద్ధాకపూర్. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, రోహన్ శ్రేష్ట, ఆదిత్య రాయ్ కపూర్, వనరాజ్ ఝావేరీ, ఫర్హాన్ అక్తర్‌లతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం ఆమె .. ప్రముఖ స్క్రీన్ రైటర్ రాహుల్ మోడీతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ పలుమార్లు పబ్లిక్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

ప్రియుడితో దొరికిపోయిన శ్రద్ధ
తాజాగా శ్రద్ధాకపూర్, రాహుల్ మోడీలు మరోసారి మీడియా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అసలేం జరిగిందంటే.. ముంబైలో జరిగిన కాఫీ ఫెస్టివల్ వీరిద్దరూ జంటగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రకరకాల ఫుడ్ స్టాల్స్‌ను సందర్శిస్తూ ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో జపనీస్ స్టాల్‌ల్ స్పెషల్ స్వీట్.. మోచిని టేస్ట్ చేసింది ఈ జంట. దీనిని ఎంతో ఇష్టపడిన శ్రద్ధా.. ఈ వెంటనే తన పక్కనే ఉన్న ప్రియుడు రాహుల్ మోడీకి తినిపించింది.

పబ్లిక్‌గా అలాంటి పనులు
దీనికి సంబంధించిన వీడియోను అక్కడి నిర్వాహకులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మేం ఏర్పాటు చేసిన స్టాల్ వద్దకు శ్రద్ధాకపూర్ వచ్చి జపనీస్ మోచిని రుచి చూడటం మాకెంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శ్రద్ధాకపూర్, రాహుల్‌లు తమ బంధాన్ని ఎప్పుడు బయటపెడతారోనని కామెంట్స్ పెడుతున్నారు. అన్నట్లు ప్రస్తుతం తాను నటిస్తున్న ఈత మూవీ పూర్తి చేసిన తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌ను రాహుల్ మోడీ దర్శకత్వంలోనే చేయనున్నారు శ్రద్ధాకపూర్.

More from Filmibeat

Read more about: shraddha kapoor rahul mody
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X