‘సాహో’ బ్యూటీ కొత్త కారు.. ఎన్నికోట్లో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే. 'సాహో' చిత్రంతో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించి మెప్పించింది. ఈ చిత్రంలో ప్రభాస్ కు ధీటుగా పెర్ఫామెన్స్ ఇచ్చి దక్షిణాది ఆడియెన్స్ ను కూడా తనవైపు తిప్పుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ శ్రద్ధా కపూర్ నార్త్ ఆడియెన్స్ ను ఫుల్ ఖుషి చేస్తోంది. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ 2010లో టీన్ పట్టి సినిమాతో కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.
ఇక శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటుందో తెలిసిందే. మరోవైపు తన సినిమాల ద్వారా శ్రద్ధా కపూర్ గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. ఇక తాజాగా శ్రద్ధా దాస్ కొత్త కారులో ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇప్పటికే ఓ ఖరీదైన కారును కొనుకున్న శ్రద్ధా కపూర్ తాజాగా మరో కోట్లు విలువ చేసే కారును కొనుగోలు చేసింది.

తాజాగా శ్రద్ధా కపూర్ న్యూ ప్రీమియం లెక్సస్ LM 350h 4- సీటర్ కారులో ముంబై స్ట్రీట్స్ లో తిరుగుతూ కనిపించింది. అయితే న్యూ మోడల్ కు సంబంధించిన ఆ కారు ధర ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. లెక్సస్ LM మోడల్ కు చెందిన ఆ కారు ధర అక్షరాల రూ.2.93 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అడ్వాన్డ్స్ టెక్నాలజీ, హై సేఫ్టీ ఫీచర్స్ ఉన్నప్పటికీ ఈ కారుకు అంత ధర ఉంటడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇదే కారులో శ్రద్ధా కపూర్ జిమ్ వర్కౌట్ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ కనిపించింది.
ఇక ఆ కారు అత్యంత లగ్జరీ, అధునాతన సాంకేతికత, ప్రీమియం డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. సిగ్నేచర్ స్పిండిల్ గ్రిల్, LED హెడ్‌లైట్లు, ఫ్లూయిడిక్ బాడీ లైన్‌లతో ఏరోడైనమిక్ డిజైన్ లతో ఈ మోడల్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక ఇంటీరియర్ కూడా అల్ట్రా-లగ్జరీని కలిగి ఉంది. ఈ మోడల్స్ లో 4 సీటర్, 7 సీటర్ అందుబాటులో ఉంది. సినీ తారల కోసం ప్రత్యేక డిజైన్స్ ఉండటం విశేషం. ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ సినీ తారలకు బాగా ప్రాచుర్యం పొందింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ సహా చాలా మంది పెద్ద స్టార్ ఈ ఎంపీవీ వెహికిల్ ను కలిగి ఉన్నారు.
శ్రద్ధా దాస్ కొద్ది నెలల కిందనే లంబోర్గినీ హురాకాన్ టెక్నికానను సొంతం చేసుకుంది. దాని ఖరీదు కూడా కోట్లట్లో ఉంటుంది. ఈ రెండే కాకుండా మరిన్ని కార్లు కూడా శ్రద్ధా కపూర్ కార్ గ్యారేజీలో ఉన్నాయి. ఇలా మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్లను తన సొంతం చేసుకుంటూ ముంబై వీధుల్లో మాత్రం తళుక్కున మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చివరిగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'స్త్రీ 2' చిత్రంలో నటించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. తర్వాత ఎలాంటి సినిమాను అనౌన్స్ చేయలేదు.


Click it and Unblock the Notifications











