Shraddha Kapoor : ముచ్చటగా మూడోసారి డేటింగ్ లో శ్రద్ధా కపూర్, ఆ అందగాడు ఎవరంటే?
Shraddha Kapoor : సాహో చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ నటుడు శక్తి కపూర్ కూతురిగానే సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ.. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. 2010లో టీన్ పట్టి సినిమాలో చిన్న పాత్రతో కెరియర్ ప్రారంభించిన ఈమె.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత అంటే 2013లో వచ్చిన ఆషికి-2 సినిమా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొని టాప్ హీరోయిన్ గా నిలిచింది.
అందానికి అందం, అబినయానికి అభినయం కలగలపిన ఆ బాలీవుడ్ భామ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఓ వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈమె సామాజిక మాధ్యమాల్లో ఎంత బిజీగా ఉంటుందో అంతకు మించి ఈమె గురించి రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ హాట్ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే..!

ముందుగా ఆషికి-2 నటుడితో డేటింగ్..
ముచ్చటగా మూడోసారి ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడిందని.. ఓ అందగాడితో కలిసి డేటింగ్ కూడా చేస్తోందని తెలుస్తోంది. నెట్టింట, బీ టౌన్ లో ఇందుకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆషికి-2 సినిమా నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోవడంతో అంతా ఆఫ్ స్క్రీన్ లోనూ వీరు ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. కేవలం అనుకోవడమే కాదు డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు కూడా పుట్టించారు. కొన్నాళ్లకు ఈ వార్త పాతదైపోయింది. అంతా దీన్ని పక్కన పడేశారు.

రెండోసారి ఫొటోగ్రాఫర్ తో ప్రేమాయణం
ఇది జరిగిన మరి కొంత కాలానికే ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహాన్ శ్రేష్ఠతో శ్రద్ధా కపూర్ కనిపించింది. ఎక్కడ చూసినా ఈ జంట కలిసి కనిపించడంతో వీరు ప్రేమలో ఉన్నట్లు భావించారు అంతా. అప్పుడు కూడా అంటే రెండో సారి కూడా శ్రద్ధా కపూర్ పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. కానీ ఇవి కూడా ఎక్కువ కాలం సాగలేవు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మూడోసారి డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తు జూతీ మైన్ మక్కర్ చిత్రానికి సహ రచయితగా పని చేసిన రాహుల్ మోడీతో ఈమె డేటింగ్ చేస్తోందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

మరి ఇతడితో డేటింగ్ ఎంత కాలమో?
ఇది నిజమో, అబద్ధమో తెలియదు కానీ ఈ వార్తలపై శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. నెటిజెన్లు కూడా.. న్యూ లవ్ బర్డ్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో మూడోసారి అయినా దీన్ని బయట పెడతావా, ఈ ప్రేమను ఇలాగే కొనసాగిస్తావా అంటూ నెట్టింట రాసుకొస్తున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి. ఇదిలా ఉండగా.. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈమెకు ఈడీ నుంచి సమన్ల అందాయి. శుక్రవారం రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశింటినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











