ప్రేమలోపడ్డ శ్రద్ధాకపూర్.. డేటింగ్ ఎవరితోనంటే.. సాహోతో బిజీగా
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో పలువురి హీరోలతో ముడిపెడుతూ అఫైర్ వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగానే వినిపించాయి. మొన్న మొన్నటి వరకు శ్రద్ధాకపూర్‌కు బాలీవుడ్ నటుడు ఫరాన్ అఖ్తర్ అఫైర్ నడుస్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా శ్రద్దా కపూర్ ఓ కొత్త వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టు వార్త గుప్పుమన్నది. ఆ వ్యక్తి ఎవరంటే ..

సెలబ్రిటి ఫొటోగ్రాఫర్ రోహన్‌తో
ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధాకపూర్ చాలా సన్నిహితంగా ఉంటుందట. సమయం చిక్కితే వారిద్దరు కలిసి టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారట. ఒకరంటే మరొకరికి వల్లమాలిన అభిమానం ఉందట. అందుకే వారిద్దరూ దగ్గరయ్యారని సినీ వర్గాల్లో టాక్.

శ్రద్దా కపూర్‌తో డేటింగా?
శ్రద్దాకపూర్‌తో డేటింగ్ వార్తలను రోహన్ కొట్టిపడేశాడు. ఇటీవల ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధాకపూర్‌తో ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చాడు. గత తొమ్మిదేళ్లుగా మా మధ్య సన్నిహిత సంబంధం ఉంది. కానీ నేను ఆమెతో డేటింగ్ చేయడం లేదు. ఇటీవల పార్టీలో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించండంతో డేటింగ్ వార్తకు బలం చేకూరింది.

మేము క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే
శ్రద్దాకపూర్ అందగత్తే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మా మధ్య అలాంటి ఆకర్షణ లేదు. మా ఇద్దరికి పరిచయం జరిగినప్పటి నుంచి మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే. శ్రద్ధాకపూర్‌తో కాకుండా నేను మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాను. ఇంకా మా రిలేషన్ మొగ్గ దశలోనే ఉంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని రోహన్ అన్నాడు.

సాహో చిత్రంతో బిజీగా
ఇక శ్రద్ధాకపూర్ కెరీర్ విషయానికి వస్తే చేతి నిండా పనితో బిజీగా ఉన్నారు. సాహో చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది. అలాగే బాలీవుడ్ చిత్రం స్త్రీ విడుదలకు సిద్ధంగా ఉంది. బట్టి గుల్ మీటర్ చాలూ అనే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











