డెంగ్యూ బారిన పడిన ‘సాహో’ హీరోయిన్ శ్రద్ధా కపూర్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' ద్వారా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రద్ధా కపూర్ ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రద్ధా కపూర్ డెంగ్యూ బారిన పడ్డట్లు సమాచారం. చికిత్స తీసుకుంటున్న శ్రద్ధా కపూర్ మరో పది రోజుల పాటు షూటింగుకు దూరంగా ఉండబోతున్నారు. దీంతో సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగుకు బ్రేక్ పడ్డట్లయింది.

సైనా నెహ్వాల్ బయోపిక్ గురించిన వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ టి-సిరీస్ వారు నిర్మిస్తున్నారు. అముల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాత.
శ్రద్ధా కపూర్ 'సైనా బయోపిక్'తో పాటు తెలుగు మూవీ 'సాహో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన బాలీవుడ్ మూవీ స్త్రీ ఇటీవల విడుదలైన రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. మరో చిత్రం 'బట్టి గుల్ మీటర్ చాలు' మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











