ప్రభాస్ కోసం సంక్రాంతి గిఫ్ట్.... తిల్‌గుల్ లడ్డూలు పంపిన శ్రద్ధా కపూర్!
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సాహో' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ సంక్రాంతి సందర్బంగా యంగ్ రెబల్ స్టార్‌కు గిఫ్ట్ పంపడం హాట్ టాపిక్ అయింది. ఆమె రిటర్న్ గిఫ్ట్ పంపినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
'సాహో' షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రద్ధా కపూర్‌ను ప్రభాస్‌తో పాటు చిత్రం బృందం తమ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆమె కోసం స్పెషల్ తెలుగు వంటకాలను స్వయంగా ఇంటి నుంచి వండించి పెట్టేవారట.

తిల్ గుడల్ లాడూస్ పంపిన శ్రద్ధా కపూర్
మహారాష్ట్రలో మకర సంక్రాంతి సందర్భంగా తిల్ గుల్ లాడూస్ (నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు) ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు ఇచ్చిపుచ్చుకవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో పాటు దర్శక నిర్మాతల కోసం శ్రద్ధా కపూర్ తిల్ గుల్ లాడూస్, నెయ్యితో చేసిన కిచిడీ పంపిందట.

వారితో అంత అనుబంధం ఏర్పడింది కాబట్టే రిటర్న్ గిఫ్ట్
ప్రభాస్, చిత్ర బృందంతో కుటంబం లాంటి అనుబంధం ఏర్పడింది కాబట్టే శ్రద్ధా కపూర్ వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

సాహో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 9 నెల ముందే రిలీజ్ డేట్ ఖరారు చేసింది చిత్ర బృందం.

ప్రభాస్ రేంజికి తగిన విధంగా
ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లు సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. దానికి ఏ మాత్రం తగ్గకుండా రూ. 250 నుంచి రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ‘సాహో'ని ఓ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











