షూటింగ్ లో తీవ్రగాయపడ్డ ప్రభాస్ హీరోయిన్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ?

Shraddha Kapoor: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో 'సాహో'లో నటించి బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్. ఈ అమ్మడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉన్నా.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం అమ్మడు 'ఈథా' (Etha) అనే బయోపిక్ లో నటిస్తుంది. ఈ మూవీ సెట్ లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో శ్రద్దా ఎడమ కాలికి గాయాలు అయిన విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ షూటింగ్ సమయంలో గాయపడడం అభిమానుల్లో తీవ్ర ఆందోళనను రేపింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ఈఠా' (Eetaa) షూటింగ్ మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో జరుగుతోంది. భారీ సెట్‌లో జానపద పాటను చిత్రీకరిస్తుండగా, శ్రద్ధా ధరించిన బరువైన ఆభరణాలు, సంప్రదాయ నౌ వారీ చీర కారణంగా స్పీడ్ డ్యాన్స్ మూమెంట్స్‌లో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిందట. దీంతో బరువు మొత్తం ఎడమ కాలిపై పడటంతో ఆమెకు తీవ్ర గాయమైందట. వెంటనే మూవీ యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు గాయం పరీక్షించి కాలులో ఫ్రాక్చర్, మజిల్ టియర్ ఉన్నట్లు గుర్తించారు.

Shraddha Kapoor Injured During Eetaa Shoot Prabhas Saaho Heroine Shares Health Update After Fracture

వైద్యుల సూచన మేరకు శ్రద్ధా కనీసం రెండు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని టీమ్ ప్రకటించింది. సినిమా సెట్స్‌లో జరిగిన ఈ ప్రమాదం కారణంగా మూవీ షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు, కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఘటనపై చర్చ కొనసాగుతున్న సమయంలో, ఒక నెటిజన్ ఇన్‌స్టాలో "మీ గాయం ఎలా ఉంది?" అని అడగగా, శ్రద్ధా స్వయంగా స్పందించారు. ఆసుపత్రి పడకపై ఉన్న చిన్న వీడియోను షేర్ చేశారు.

హీరో శ్రద్ద మాట్లాడుతూ.. "పెద్ద ప్రమాదం ఏం కాదు. కాలి కండరానికి దెబ్బ తగిలింది. కొంచెం ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. నేను బాగానే ఉన్నాను. కంగారు పడకండి. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాను." అని పేర్కొంది. ఈ స్పందనతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. టీమ్ వర్గాల ప్రకారం రెండు వారాల్లో షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

'ఈఠా' మహారాష్ట్ర లెజెండ్ కథ
ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఈఠా' కథ మహారాష్ట్ర తమాషా కళాకారిణి, ఈ మూవీ విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. జానపద నృత్యం తమాషా కళను భారతవ్యాప్తంగా పరిచయం చేసి, దానికి గౌరవాన్ని తెచ్చిన కళాకారిణిగా విఠాబాయి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచింది.

ఆమెకు 1957, 1990ల్లో రాష్ట్రపతి పురస్కారాలు లభించాయి. తమాషా కళను ప్రాచుర్యం చేయడానికి ఆమె చేసిన కృషి గణనీయం. ఈ పాత్రను ఛాలెంజింగ్ తీసుకున్న శ్రద్ద లావణి డ్యాన్స్, తమాషా సంగీతం, సంప్రదాయ ప్రదర్శనలపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు టీమ్‌లోని వర్గాలు చెబుతున్నాయి. ఇక 'సాహో' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రద్ధా, బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. 'ఆషిఖి 2, 'హైడర్','ABCD 2','చిచోరే'సినిమాతో ఆ అమ్మడు కెరీర్ మైల్ స్టోన్స్ గా నిలిచాయి.

More from Filmibeat

Read more about: shraddha kapoor saho prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X