twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రద్ధాకపూర్ పెళ్లికి ముహుర్తం.. వరుడు ఎవరంటే.. అందుకే ఆ సినిమాకు గుడ్‌బై

    |

    బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ వరుస సక్సెస్‌లతో కెరీర్‌ను బ్రహ్మండంగా కొనసాగిస్తున్నది. గత కొద్దికాలంగా పలువురు బాలీవుడ్ హీరోలతో అఫైర్ వార్తలు వెలుగులోకి వచ్చినా అవి ఎక్కువ రోజులు నిలబడలేదు. కానీ తాజాగా శ్రద్ధాకపూర్ అఫైర్ పెళ్లి వరకు వెళ్లిందనే వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం పెళ్లి వార్తకు మరింత బలం చేకూరిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాల్లోకి వెళితే..

    బాల్య స్నేహితుడితో వివాహం

    బాల్య స్నేహితుడితో వివాహం

    శ్రద్దాకపూర్ కొద్దికాలంగా తన బాల్య స్నేహితుడు, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్టతో అఫైర్‌ను కొనసాగిస్తున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. అయితే తాజాగా రోషన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు స్వైర విహారం చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లలో నిజం ఉందని సన్నిహితులు చెప్పుకొంటున్నారు.

     2020 ఆరంభంలో శ్రద్ధా పెళ్లి

    2020 ఆరంభంలో శ్రద్ధా పెళ్లి

    శ్రద్దా, రోషన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం వారి ప్రేమకు పెద్దల అంగీకారం రావడంతో 2020లో పెళ్లికి ముహుర్తాలు పెట్టినట్టు సమాచారం. బాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి జరిగే అవకాశం ఉందని విషయం బయటకు పొక్కింది.

     సైనా బయోపిక్‌కు గుడ్‌బై

    సైనా బయోపిక్‌కు గుడ్‌బై

    శ్రద్ధాకపూర్ చేతిలో భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్. ఈ సినిమా నుంచి అనూహ్యంగా శ్రద్ధా తప్పుకోవడం వెనుక పెళ్లి కూడా ఓ కారణమని చెప్పుకొంటున్నారు. శ్రద్ధా కపూర్ తప్పుకోవడంతో ఆ చాన్స్ పరిణితి చోప్రాకు దక్కిన విషయం తెలిసిందే.

    ఆగస్టులో సాహోతో

    ఆగస్టులో సాహోతో

    శ్రద్ధాకపూర్ ప్రస్తుతం సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్నది. తొలిసారి తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సాహో చిత్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రను పోషిస్తున్నట్టు, అంతేకాకుండా ద్విపాత్రిభినయం కూడా చేస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆగస్టులో సాహో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    English summary
    Bollywood actress Shraddha Kapoor is seriously planning to get married. Reports suggest that, Shraddha is all set to tie the knot with her childhood friend and popular fashion photographer Rohan Shrestha next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X