Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
శ్రద్దాకపూర్.. అతడిని పెళ్లి చేసుకొంటున్నావా? రిపోర్టర్ ప్రశ్నకు సాహో బ్యూటీ దిమ్మతిరిగే జవాబు
సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ కెరీర్ ఎలా ఉన్నప్పటికీ... ఆమె డేటింగ్, అఫైర్లు, ఇతర వ్యవహారాలపై మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు కారణం రోహన్ శ్రేష్ట అనే ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, బాల్య మిత్రుడితో డేటింగ్ చేయడమే. అయితే రోహన్‌తో వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు శ్రద్దా కపూర్ ఎలా స్పందించారంటే...
ముదిరి పాకాన పడ్డ శ్రద్దాకపూర్ అఫైర్
శ్రద్దాకపూర్, రోహన్ శ్రేష్ట అఫైర్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. వారిద్దరూ తమ రిలేషన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో శ్రద్దా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో కొద్దికాలంగా వైరల్ అవుతున్నది. అయితే శ్రద్దా మాత్రం ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు.
శ్రద్దాకపూర్ పెళ్లిపై తండ్రి రియాక్షన్
అయితే తన కూతురు శ్రద్దా కపూర్ పెళ్లి వార్తలపై తండ్రి, బాలీవుడ్ నటుడు శక్తికపూర్ మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ.. అవునా.. నాకు ఇంకా తెలియదు. మీడియాలో వస్తున్న వార్తల గురించి పట్టించుకోవడం లేదు. కానీ నా కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా నేను సమర్ధిస్తాను. అది రోహన్ అయినా గానీ, మరెవరైనా గానీ నా కూతురు పెళ్లి విషయంలో అభ్యంతరం లేదు అని అన్నారు.
శ్రద్దాకపూర్ ప్రియుడి రుసరుస
ఇక శ్రద్దాతో పెళ్లి విషయంపై మీడియా అడిగే ప్రశ్నలకు రోహన్ శ్రేష్ట సమాధానాలు దాట వేస్తున్నారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా ఆటపట్టించడంతో ఘాటుగా స్పందించాడు. శ్రద్దాతో పెళ్లిపై అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. నీవు ఏమైనా రెడీగా ఉన్నావా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
ఏం మాట్లాడుతున్నావంటూ శ్రద్దా ఫైర్
ఇలాంటి వార్తల నేపథ్యంలో ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించిన శ్రద్దా కపూర్‌ను మీడియా వెంటాడింది. ఆమెను కెమెరాల్లో బంధిస్తూ రోహన్ శ్రేష్టను పెళ్లి చేసుకొంటున్నారటగా.. పెళ్లి తేది ఎప్పుడు అంటూ కురిసిన ప్రశ్నలపై గరం అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ ఘాటుగా జవాబిచ్చేసరికి మీడియా ప్రశ్నలు అడగడాన్ని ఆపేశారు. దాంతో శ్రద్దా కారు ఎక్కి వెళ్లిపోయారు.
శ్రద్దా కపూర్ కెరీర్ ఇలా..
గత రెండేళ్లుగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న శ్రద్దా కపూర్ పలు హిట్లను తన ఖాతాలో వేసుకొన్నారు. సాహో, చిచ్చోరే, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ, భాగీ 3 చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగు ఢిల్లీలో జరుగుతున్నది.