జాన్వి కంటే శ్రద్దా రేటు తక్కువా? 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ కేవలం ఇంతకే ఓకే చేసిందా?

ఇప్పుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో ఉన్న ఏకైక సీక్వెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా పుష్ప 2 ది రూల్ అనే చెప్పాలి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రశ్మికా మందన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ అవైటెడ్ సీక్వెల్ ని దర్శకుడు సుకుమార్ పక్కా ప్లానింగ్ తో పార్ట్ 1 కి ఎన్నో రెట్లు భారీతనంతో తెరకెక్కిస్తున్నారు. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ కావాల్సిందే వాయిదా పడుతూ వచ్చింది.

అలా ఆగస్ట్ రేస్ నుంచి డిసెంబర్ కి సినిమా వాయిదా వేశారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాకి మాత్రం అప్పుడు ఎన్ని అంచనాలు ఉన్నాయో అదే రీతిలో అంచనాలు కొనసాగుతూ రావడం విశేషం. సినిమా మొదలైన మొదట్లో పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల బిజినెస్ చేస్తుంది అని చెప్పాము అలానే పుష్ప చేస్తున్నట్టుగా సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. కాగా పార్ట్ 1 పెద్ద హిట్ అయ్యేసరికి పార్ట్ 2 కి కూడా స్పెషల్ ప్లానింగ్ లు మేకర్స్ చేస్తున్నారు.

Shraddha kapoor rate is cheaper than janhvi kapoor for pushpa 2 special song

కాగా ఆ ప్లానింగ్స్ లో పార్ట్ 1 లో సమంతతో ఊ అంటావా మావ సాంగ్ ని ఎలా ప్లాన్ చేశారో పార్ట్ 2 కి కూడా అంతకు మించిన హైప్ ఆ సాంగ్ పై వచ్చింది. అయితే చిత్రయూనిట్ కి ఈసారి సాంగ్ కి ఎవరిని తీసుకోవాలా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అలా బాలీవుడ్ హాట్ ముద్దు గుమ్మల పేర్లే బాగా వినిపించాయి. అందులో మొదటి నుంచీ దేవర బ్యూటీ జాన్వీ కపూర్ అలాగే అనిమల్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి పేర్లు వచ్చాయి.

కానీ రీసెంట్ గా స్త్రీ 2 సెన్సేషన్ శ్రద్దా కపూర్ పేరు కూడా వినిపిస్తూ వచ్చింది. కాగా ఈ ముగ్గురు లో శ్రద్దా కపూర్ పేరు కోసం మొదట మేము తెలియజేసాం. మరి ఇప్పుడు ఆమె పేరు ఫైనల్ అన్నట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుండగా జాన్వీ కాకుండా శ్రద్దాకి రావడానికి మేకర్స్ దగ్గర రెమ్యునరేషన్ కారణం అన్నట్టుగా తెలుస్తోంది.

Shraddha kapoor rate is cheaper than janhvi kapoor for pushpa 2 special song

కాగా పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కి జాన్వీ కపూర్ ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తే శ్రద్దా మాత్రం 4 నుంచి నాలుగున్నర కోట్లే తీసుకుతున్నట్టుగా తెలుస్తోంది. దీనితో ఇలా శ్రద్దా కపూర్ పేరు ఫైనల్ అయిపోయినట్టే అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా మనం చూసేది ఎవరిని అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సెన్సేషనల్ ప్రొజెక్ట్ లో ఫాహాద్ ఫాజిల్ విలన్ గా నటుస్తుండగా సునీల్, అనసూయ భరద్వాజ్, అలాగే జగదీష్ తదితరులు నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నా ఈ భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ కూడా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 6న సినిమా తెలుగు, తమిళ్, హిందీ. మళయాళ, కన్నడ సహా బెంగలి భాషలో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X