twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చేతిలో గన్ను లేకుండా నిమిషం ఉండేదాన్ని కాదు.. స్టార్ హీరోయిన్

    |

    బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ సాహూ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇదే ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమాలో శ్రద్ద కపూర్ పోలీస్ రోల్ పోషిస్తోందని, ఆమె క్యారెక్టర్ ప్రభాస్‌తో సరి సమానంగా ఉంటుందని తెలిసింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో కూడా గన్ను పట్టి యాక్షన్ సీన్స్‌లో పర్ఫెక్ట్ లేడీగా దర్శనమిచ్చింది శ్రద్ద. అయితే సాహూలో తాను పోషించేది పోలీస్ రోలేనని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది శ్రద్ద కపూర్.

    ఈ సందర్బంగా కాసేపు మీడియాతో ముచ్చటించిన ఈ భామ.. తాను తొలిసారి పోలీస్ పాత్ర పోషిస్తున్నానని, ఈ పాత్రలో నటిస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది. దేశ భద్రత కోసం పాటు పడే పోలీస్ పాత్ర దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్బంగా ఈమె పేర్కొంది. ఎన్ని రకాల రోల్స్ చేసినా పోలీస్ రోల్ చేయడం చాలా ప్రత్యేకమని తెలిపింది. షూటింగ్ జరుగుతున్నంత సేపు గన్ను పట్టుకునే ఉండేదాన్ని అని, గన్ను లేకుండా ఒక్క నిమిషం కూడా సెట్స్‌పై ఉండేదాన్ని కాదని శ్రద్ద కపూర్ చెప్పుకొచ్చింది. సాహూలో తన పాత్ర హైలైట్‌గా ఉంటుందని ఆమె చెప్పింది.

    Shraddha Kapoor Role in Saaho Movie

    యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్2తో సాహూ సినిమా తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ఆగస్టు 15 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున 'సాహూ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. In this bollywood heroine Shraddha Kapoor played a lead role as police
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X