Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చేతిలో గన్ను లేకుండా నిమిషం ఉండేదాన్ని కాదు.. స్టార్ హీరోయిన్
బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ సాహూ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఇదే ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమాలో శ్రద్ద కపూర్ పోలీస్ రోల్ పోషిస్తోందని, ఆమె క్యారెక్టర్ ప్రభాస్‌తో సరి సమానంగా ఉంటుందని తెలిసింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్లో కూడా గన్ను పట్టి యాక్షన్ సీన్స్‌లో పర్ఫెక్ట్ లేడీగా దర్శనమిచ్చింది శ్రద్ద. అయితే సాహూలో తాను పోషించేది పోలీస్ రోలేనని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది శ్రద్ద కపూర్.
ఈ సందర్బంగా కాసేపు మీడియాతో ముచ్చటించిన ఈ భామ.. తాను తొలిసారి పోలీస్ పాత్ర పోషిస్తున్నానని, ఈ పాత్రలో నటిస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది. దేశ భద్రత కోసం పాటు పడే పోలీస్ పాత్ర దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్బంగా ఈమె పేర్కొంది. ఎన్ని రకాల రోల్స్ చేసినా పోలీస్ రోల్ చేయడం చాలా ప్రత్యేకమని తెలిపింది. షూటింగ్ జరుగుతున్నంత సేపు గన్ను పట్టుకునే ఉండేదాన్ని అని, గన్ను లేకుండా ఒక్క నిమిషం కూడా సెట్స్‌పై ఉండేదాన్ని కాదని శ్రద్ద కపూర్ చెప్పుకొచ్చింది. సాహూలో తన పాత్ర హైలైట్‌గా ఉంటుందని ఆమె చెప్పింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్2తో సాహూ సినిమా తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా శ్రద్ద కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ఆగస్టు 15 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున 'సాహూ' ప్రేక్షకుల ముందుకు రానుంది.