ప్రియుడి చేతిలో బందీ అయిన శ్రద్దాకపూర్.. బర్త్‌డే బేబీకి ఖరీదైన గిఫ్టు ఏమిటో తెలుసా?
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ జన్మదిన వేడుకలను ప్రియుడు రోషన్ శ్రేష్ట క్రేజీగా నిర్వహించారు. బాయ్‌ఫ్రెండ్ చూపిన ప్రేమలో శ్రద్దాకపూర్ తడి ముద్దయ్యారు. జన్మదిన వేడుకల్లో వారిద్దరి రొమాంటిక్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకొన్నాయి. ఇక మాల్దీవుల్లో శ్రద్దా, రోషన్ ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేశారంటే..

మాల్దీవుల్లో సాహో బ్యూటీ
సాహో బ్యూటీ శ్రద్దాకపూర్ ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. తన కజిన్స్ ప్రియాంక శర్మ, షాజా మోరానీ పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వేడుకల్లో శ్రద్దాకపూర్ ప్రియుడు రోహన్ కూడా పాల్గొనడం ఆమెకు మరింత ఎంజాయ్‌మెంట్ దొరికింది.

శ్రద్దాకు సర్‌ప్రైజ్ మూమెంట్స్
తన కజిన్స్ పెళ్లి వేడుకల్లో శ్రద్దాకపూర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ హైలెట్‌గా మారాయి. తన కజిన్ ప్రియాంక శర్మ ఓ అందమైన కేక్‌ను తీసుకొచ్చి శ్రద్దాను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అలా తన ఫ్యామిలీ మధ్య శ్రద్దాకపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ముంగించింది.

ప్రత్యేక ఆకర్షణగా బాయ్‌ఫ్రెండ్
శ్రద్దా బర్త్ డే సెలబ్రేషన్స్‌లో రోహన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. శ్రద్దా కుటుంబంలో రోహన్ ఒక్కడిగా మారారు. ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం శ్రద్దా కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రద్దాకపూర్ ఖరీదైన బర్త్ డే గిఫ్టును కూడా ఇచ్చినట్టు సమాచారం.
Recommended Video

కౌగిలిలో బంధించి అయిన శ్రద్దా
శ్రద్దా బర్త్ డే వేడుకల్లో రోహన్ వ్యవహరించిన తీరు అందర్ని ఆకట్టుకొన్నది. శ్రద్దాను రోహన్ బంధించి ముద్దాడాడు. తన కౌగిలిలో ఉంచుకొని ప్రేమను కురిపించాడు. అలా తన బాయ్‌ఫ్రెండ్‌తో మధురానుభూతిని పొందేలా శ్రద్దా బర్త్‌డేను జరుపుకొన్నది.

శ్రద్దాకపూర్ కెరీర్ ఎలా ఉందంటే..
శ్రద్దాకపూర్‌కు 2019లో కెరీర్‌ను బ్రహ్మండంగా సాగింది. సాహో, చిచ్చోరే చిత్రాలు మంచి ఫలితాలను అందించింది. అలాగే స్ట్రీట్ డ్యాన్స్, భాగీ చిత్రాలు కూడా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె నటించిన పలు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











