శ్రద్ద కపూర్‌పై సాహో ఎఫెక్ట్! అదే జరిగిందంటే ఇక..
ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ సినిమా సాహో ద్వారా తెలుగు తెరపై కాలు మోపుతోంది హీరోయిన్ శ్రద్ద కపూర్. ఇప్పటికే బాలీవుడ్‌లో భారీ క్రేజ్ కొట్టేసిన ఈ భామ తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో కూడా నానిపోయింది. అందుకు కారణం సాహో భారీ ప్రమోషన్స్. అయితే సాహో సినిమాలో నటించేందుకు శ్రద్ద కపూర్ 7 కోట్ల రూపాయలకు పైగానే పుచ్చుకుందనే వార్తలు విన్నాం.
నిజానికి గతంలో శ్రద్ద రెమ్మ్యూనరేషన్ 3 కోట్లు మాత్రమేనట. కానీ సాహోలో నటించాలంటే, దీంతో పాటు వేరే ఏ సినిమా చేయొద్దు అనే కండీషన్ పెట్టడంతో ఆమె 7 కోట్లు డిమాండ్ చేయాల్సి వచ్చిందట. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు ఆమె కెరీర్‌పై స్పెషల్ ఎఫెక్ట్ చూపనుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం ఇప్పటికే సాహో సినిమాకు భారీ హైప్ రావడం, ప్రభాస్ పక్కన శ్రద్ద బాగా సూట్ అయిందని టాక్ రావడమే. ఇక సాహో గనక సూపర్ హిట్ అయ్యిందంటే.. తెలుగు, హిందీ భాషల్లో మున్ముందు శ్రద్ద డిమాండ్ బాగా పెరిగి ఆమె రెమ్మ్యూనరేషన్ 10 కోట్లు దాటడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే శ్రద్ద కపూర్ కంటే అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు చెప్పండి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఆగస్టు 30 న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











