ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ పబ్లిక్‌గా..సహజీవనంలో అలా ముద్దు ముచ్చట తీర్చేసుకొంటూ!
సినిమా రంగంలో హీరోయిన్లు ఎవరితో ఎప్పుడూ కలిసి ఉంటారో.. ఎప్పుడు విడిపోతారో కూడా ఊహించకుండా ఉంటుంది. ఓ సెలబ్రిటీతో డేటింగ్, అఫైర్ కొనసాగిస్తున్నదనే వార్తలు సద్దుమణగకముందే.. మరో హీరోతో హీరోయిన్ డేటింగ్ చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి క్రమంలో ఏది నిజం? ఏది అబద్దం అనేది తేల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్దాకపూర్ మాత్రం తన ప్రియుడితో లెక్కలు తేల్చేసింది. తాజాగా ఆమె పోస్టు చేసిన ప్రియుడి ఫోటోతో తన రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చేసింది. శ్రద్దాకపూర్ పోస్టు వివరాల్లోకి వెళితే...
శ్రద్దా కపూర్ జీవితంలో చాలా మంది ప్రముఖులతో అఫైర్ రూమర్లు వచ్చాయి. గతంలో వన్‌రాజ్ జవేరీ అనే బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో కొంతకాలం అఫైర్ కొనసాగించింది. ఆ తర్వాత సీనియర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్‌తో చెట్టాపట్టాలేసుకొని లైఫ్‌ను లీడ్ చేసింది. ఇలా పార్ట్ టైమ్ డేటింగ్ లైఫ్ వార్తల అనంతరం రోహన్ శ్రేష్టతో డేటింగ్ చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి.

ఇలా పలువురితో లింకప్ వార్తలు బ్రేక్ ఇస్తూ.. తాజాగా స్క్రీన్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో సహజీవనం చేస్తుందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే తన డేటింగ్ లైఫ్ గురించి చెప్పడానికి ఇష్టపడకపోగా.. చాటుమాటుగా తనతో కలిసి షికార్లు కొట్టడం మీడియా పసిగట్టేసింది. అయితే తన లవ్ లైఫ్ గురించి పెదవి విప్పడానికి నిరాకరించింది. అయితే తన డేటింగ్ లైఫ్ వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ప్రియుడు రాహుల్‌తో ఫోటోను షేర్ చేసింది.
శ్రద్దాకపూర్ ప్రియుడు రాహుల్ మోడీతో కలిసి ఒకే డ్రస్సు వేసుకొని దిగిన ఫోటోను తన ఫోన్ స్టేటస్ ద్వారా షేర్ చేసింది. దాంతో వారిద్దరూ డేటింగ్ లైఫ్‌లో ఉన్నారనే విషయం స్పష్టమైంది. ఇద్దరు ఒకే డిజైన్ ఉన్న డ్రస్సు వేసుకొని తాజా ఫోటోలో దర్శనమిచ్చారు. అయితే ఇద్దరు కూడా ఒకే ఫోటోను తమ స్టేటస్‌గా పెట్టుకోవడంతో అధికారికంగా తన అఫైర్‌ను బయటపెట్టినట్లయింది.

శ్రద్దా, రాహుల్ మ్యాచింగ్ డ్రస్సులు వేసుకొని పెట్టిన ఫోటో కింద హార్ట్ సింబల్ పెట్టడంతో రూమర్లకు తెరదించింది. గతంలో కూడా తన ప్రియుడితో కలిసి డేటింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేస్తాం. కలిసి సినిమాకు వెళ్తాం. నా పార్ట్‌నర్‌తో డిన్నర్ చేస్తాను. ఇద్దరం కలిసి టూర్లకు వెకేషన్‌కు వెళ్తాం అని ఆమె చెప్పిన విషయం తెలిసిందే.
శ్రద్దా కపూర్ కెరీర్ గ్రాఫ్ బ్రహ్మండంగా కొనసాగుతున్నది. ఆమె నటించిన స్త్రీ 2 సినిమా సుమారుగా 700 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఆమె ఇటీవల నటించిన తు జూఠీ మై మక్కర్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆ మూవీకి పనిచేసిన రాహుల్ మోడీతో ప్రేమలో పడింది. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.


Click it and Unblock the Notifications











