192 కోట్లతో ప్రభాస్ రికార్డుకు శ్రద్దాకపూర్ ఎసరు.. ఎవ్వరూ టచ్ చెయ్యలేని ఆ రికార్డు ఏంటో తెలుసా?

భారతదేశ చలన చిత్ర పరిశ్రమలోని ఎన్నెన్నో బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఉండొచ్చు అలాగే ప్రతీ ఇండస్ట్రీలో కూడా ఇండస్ట్రీ హిట్లు ఉండొచ్చు కానీ ఇండియా వైడ్ గా ఇండస్ట్రీ హిట్ అయ్యిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మాత్రం ఒక్క "బాహుబలి 2" మాత్రమే అని చెప్పాలి. కాగా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి నుంచి వచ్చిన ఈ భారీ చిత్రం ఇండియన్ సినిమా గతినే మార్చేసింది.

కాగా ఈ సినిమా వచ్చిన తర్వాతే నాన్ బాహుబలి రికార్డులు అనే కొత్త పదం కూడా ఇండస్ట్రీలో యాడ్ అయ్యింది. కాగా ఈ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశంలోనే ఇండస్ట్రీ హిట్ అయ్యి సంచలనం సెట్ చేసింది. ఇంకా నార్త్ మార్కెట్ లో కూడా చాలా ఏళ్ళు బాహుబలి సెట్ చేసిన రికార్డు వసూళ్ళని అక్కడి హీరోలు కూడా టచ్ చేయలేకపోయారు.

shraddha kapoor stree 2 going to break bahubali 2 7 years record with 191 crore

కానీ ఇప్పుడు పరిస్థితి మారడంతో హిందీలో బాహుబలి 2 రికార్డులు పలు చిత్రాలు మాత్రం క్రాస్ చేసాయి. కాగా కేవలం ఇండియా వరకు హిందీ భాషలో బాహుబలి టోటల్ గ్రాస్ ని పఠాన్, జవాన్, గదర్ 2 అలాగే లేటెస్ట్ భారీ హిట్ అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా "స్త్రీ 2" కూడా బ్రేక్ చేసింది. ఇది ఓవరాల్ హిందీ మార్కెట్ గ్రాస్ కానీ ఈ మొత్తంలో ఒక్క ఏరియాలో మాత్రం బాహుబలి 2 రికార్డుని ఇప్పుడుకొచ్చి ఏ హిందీ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా ఆ ప్రాంతమే ముంబైలో అట. ముంబై టెర్రిటరీలో బాహుబలి 2 సెట్ చేసిన ఆల్ టైం రికార్డు వసూళ్లు ఇంకా అలానే ఉన్నాయట. అక్కడ బాహుబలి 2 ఏకంగా 191.5 కోట్ల నెట్ వసూళ్లు రాబడితే పైన చెప్పిన ఏ సినిమా కూడా దీనిని అందుకోలేకపోయింది. దీనితో దాదాపు 7 ఏళ్ళు నుంచి ఈ రికార్డు నాన్ టచబుల్ గానే ఉండిపోయింది. కానీ ఈ రికార్డుని ప్రభాస్ హీరోయినే బ్రేక్ చేసే సూచనలు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ చెబుతున్నారు.

shraddha kapoor stree 2 going to break bahubali 2 7 years record with 191 crore

కాగా శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 ముంబై టెర్రిటరీలో ప్రస్తుతం 185 కోట్లకి పైగా వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇది మొత్తం 7 వారాల రన్ కాగా ఫుల్ రన్ లో ప్రభాస్ రికార్డుని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ లు ఉన్నాయని వారు అంటున్నారు. ఓవరాల్ గా హిందీలో ఇప్పటికీ స్త్రీ 2 సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.

అలాగే హిందీలో ఏకంగా 600 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని బాహుబలి, పఠాన్, జవాన్ రికార్డులు భారీ మార్జిన్ తో కొట్టింది. కానీ ముంబైలో మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతుంది. మరి ఇక్కడ రికార్డుని కూడా 192 కోట్లతో కొట్టిందంటే స్త్రీ 2 హిందీ మార్కెట్ లో బాహుబలి 2 కంటే పెద్ద హిట్టే అని చెప్పాల్సిందే. మరి సాహోలో ప్రభాస్ సరసన నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు ఏకంగా తన హీరో సెట్ చేసిన అతి అరుదైన రికార్డుకే ఎసరు పెట్టిందని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసి హిస్టరీ సెట్ చేస్తుందో లేదో చూడాల్సిందే మరి.

More from Filmibeat

Read more about: stree 2 shraddha kapoor prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X