మృత్యువుతో చిన్నారి పోరాటం.. శ్రద్ధాకపూర్ చేసిన పని చూస్తే.. గుండె తరుక్కుపోవడం ఖాయం..

తమను అమితంగా అభిమానించే వారిని సినీ తారలు చాలా ఇష్టపడుతుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తన అభిమానులు అనారోగ్యంతో బాధపడుతుంటే స్వయంగా వెళ్లి పరామర్శించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా తన అభిమాని బాధపడుతుంటే బాలీవుడ్ నటి శ్రద్ధకపూర్ స్వయంగా పలకరించడం చర్చనీయాంశమైంది. జబ్బు చేసిన చిన్నారిని పరామర్శించడానికి పెద్ద సాహసమే చేశారు. అదేమిటంటే..

 13 ఏళ్ల చిన్నారికి అనారోగ్యం

13 ఏళ్ల చిన్నారికి అనారోగ్యం

ముంబైకి చెందిన 13 సంవత్సరాల సుమయ్యా క్షయవ్యాధి (టీబీ)తో బాధపడుతున్నారు. థర్డ్ స్టేజ్‌లో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, తనను చూడటానికి తపిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొన్న శ్రద్ధాకపూర్ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు.

బుర్ఖా ధరించి శ్రద్ధాకపూర్

బుర్ఖా ధరించి శ్రద్ధాకపూర్

సాహో షెడ్యూల్ బిజీగా జరుగుతున్నప్పటికీ.. కొంత సమయాన్ని తీసుకొని శ్రద్ధకపూర్ హాస్పిటల్‌కు వెళ్లారు. అభిమానులు, సాధారణ ప్రజలు గుర్తించకుండా బుర్ఖా వేసుకొని హాస్పిటల్‌ను సందర్శించారు. శ్రద్దా తీసుకొన్న చొరవ, చేసిన సాహసంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయాన్ని స్వచ్ఛంద సంస్థ కెట్టో వెల్లడించింది.

రూ.30 లక్షలు అవసరమని

రూ.30 లక్షలు అవసరమని

హాస్పిటల్‌లో చిన్నారి పరిస్థితి చూసిన శ్రద్ధా బాధతో తల్లడిల్లిపోయారు. కెమ్ హాస్పిటల్‌లో చికిత్స కోసం రూ.30 లక్షలు అవసరమని వైద్యులు చెప్పిన విషయాన్ని తెలుసుకొని గుండె పగిలేంత పనైంది. చిన్నారిని పలకరించగానే ఆమె సంతోషాన్ని చూసి శ్రద్ధా తల్లడిల్లిపోయారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.

శ్రద్ధా కలవడంతో చిన్నారి

శ్రద్ధా కలవడంతో చిన్నారి

13 సంవత్సరాల సుమయ్య టీబీ వ్యాధితో బాధపడుతున్నారు. శ్రద్దాను కలువాలనే కోరిక బలంగా ఉంది. దాంతో ఆమె కోరికను తీర్చడానికి మేము చొరవ తీసుకొన్నాం. అందుకు శ్రద్ధాకపూర్ కూడా ఒప్పుకోవడం ప్రశంసనీయం అని కెట్టో స్వచ్ఛంద ప్రతినిధులు వెల్లడించారు. శ్రద్ధాతో సుమయ్య కలుసుకొనే ఏర్పాట్లను స్వయంగా కెట్టో చేసింది.

శ్రద్ధా కపూర్ ట్వీట్‌లో

శ్రద్ధా కపూర్ ట్వీట్‌లో

టీబీ వ్యాధితో బాధపడుతున్న సుమయ్యాను కలుసుకొన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. చిన్నారి చూస్తే మనసు ద్రవించింది. ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నీ వ్యాధికి నయం కావడానికి ఏం చేయాలో నాకు చెప్పు. ఆమె సంరక్షణ కోసం పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని శ్రద్ధకపూర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X