సోషల్ మీడియాలో అదరగొట్టిన బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా ప్రధాని మోడీనే వెనక్కి నెట్టి టాప్ లోకి

బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌ గా మారింది. ఇటీవల ఈ భామ నటించిన స్త్రీ 2 మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో క్రేజ్ పాపులరిటీనీ, కొట్లాది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా.. సోషల్ మీడియాలోనూ శ్రద్ధా కపూర్ అరుదైన ఘనత దక్కింది. ఇన్ స్టాగ్రామ్ లో ఏ హీరోయిన్ కి దక్కని ఘనత ఈ భామ కొట్టేసింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్ ఫామ్ లో తన పాపులారిటీలో ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, ప్రియాంక చోప్రాలను వెనక్కి నెట్టి.. వారి కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్న వ్యక్తిగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇంతకీ ఈ బ్యూటీకి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసుకుందాం.

కపూర్ ఫ్యామిలీ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శ్రద్దకపూర్. బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన సొంతం గుర్తింపు అనునిత్యం ప్రయత్నిస్తుంది. ప్రతి విషయంలో చాలా శ్రద్దగా వ్యవహరిస్తుంది. ఆమె ఎంచుకునే ప్రతి సినిమాల్లో, ప్రతిపాత్రలోనూ వైవిధ్యం కనబరుస్తుంది. సినిమా సినిమాకు నటనలోనూ మెర్చుర్టీ కనిపిస్తోంది. ఆమె నటించిన సాహో, బాఘి 3 వంటి సినిమాల్లో కొన్ని సాహసోపేతమైన స్టంట్‌లు చేశారు. అలాగే.. ఇటీవల విడుదల 'స్త్రీ 2' లో ఆమె యాక్షన్ ప్యాక్డ్ ప్రదర్శనకు ఒక ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. మొత్తానికి తన నటనతో అగ్రశ్రేణి యాక్షన్ స్టార్లలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు శ్రద్ద కపూర్.

Shraddha Kapoor third-most followed Indian celeb on Instagram

ఒక వైపు బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంటూ ఫుల్ బిజీగా అమ్మడు మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ రోల్స్ తో పాటు ఇటీవల యాక్షన్ సినిమాల్లో నటించే ఈ బ్యూటీ తన హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ మ్యాటర్స్ కూడా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలాగే.. తన అందాల ఆరబోతలో బౌండరీలను దాటేస్తూ.. అభిమానులను కట్టిపడేస్తుంది. అలా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌ లో భారీ ఫ్యాన్స్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె 91.9 మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకుని.. ఇండియన్‌ హీరోయిన్‌ల అత్యధిక పాపులారిటీ ఉన్న నటిగా టాప్‌లో నిలిచింది. ఇండియన్‌ సెలబ్రిటీల జాబితాలో అయితే ఈ బ్యూటీ రెండో స్థానంలో నిలివగా.. వర్డల్ వైడ్ గా టాప్ 4 ఫేస్ లోని నిలిచింది శ్రద్ధా కపూర్‌.

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఇండియన్స్

#1 విరాట్ కోహ్లీ - 271 మిలియన్లు
#2 శ్రద్ధా కపూర్- 92.2 మిలియన్లు
#3 ప్రియాంక చోప్రా - 91.8 మిలియన్లు
#4 నరేంద్ర మోదీ- 91.3 మిలియన్లు
#5 అలియా భట్- 85.2 మిలియన్లు
#6 కత్రినా కైఫ్- 80.4 మిలియన్లు
#7 దీపికా పదుకొనే - 79.9 మిలియన్లు
#8 నేహా కక్కర్- 78.7 మిలియన్లు
#9 ఊర్వశి రౌటేలా- 73.0 మిలియన్లు
#10 జాక్వెలిన్ ఫెర్నాండెజ్- 70.5 మిలియన్లు.

More from Filmibeat

Read more about: shraddha kapoor instagram pm modi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X