Shraddha Kapoor Birthday: ప్రభాస్ వెరీ వెరీ స్పెషల్‌గా.. ఏం చేశారంటే!
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఈ అందాల భామ మార్చి 3వ తేదీన 33వ పడిలోకి అడుగుపెట్టింది. హిందీ, తెలుగు భాషలతోపాటు దక్షిణాదికి సాహోతో పరిచయమైన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నది. అయితే ప్రభాస్ చేసిన బర్త్ డే విషెస్ వైరల్‌గా మారింది. ఇంతకు ప్రభాస్ ఎలా జన్మదిన సందేశాన్ని అందించారంటే..

సాహోతో క్రేజీ హీరోయిన్‌గా
శ్రద్దాకపూర్ కెరీర్ విషయానికి వస్తే.. సాహో లాంటి ప్యాన్ ఇండియా మూవీతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో యాక్షన్ల సీన్లలో మెప్పించడమే కాకుండా నటనపరంగా కూడా ఆకట్టుకొన్నది. ప్రభాస్‌కు సరైన జోడి అనే పేరును సంపాదించుకొన్నది. సాహో సినిమా షూటింగ్‌లో జరిగిన పరిచయం వారిద్దరిని మంచి స్నేహితులుగా మార్చింది.

ప్రభాస్ బర్త్ డే విషెస్
తన ప్రియమైన కో-స్టార్, ఫ్రెండ్‌కు ప్రభాస్‌తోపాటు దర్శకుడు సుజిత్ కూడా తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. నా ప్రియాతి ప్రియమైన అమృత (సాహోలో క్యారెక్టర్ పేరు) శ్రద్ధాకపూర్‌కు హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ అందజేశారు. అలాగే సాహో చిత్రంలోని ఓ పోస్టర్‌ను గిప్టుగా షేర్ చేశారు.
వైరల్‌గా ప్రభాస్ పోస్టు
శద్ధాకపూర్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ పోస్టు చేసిన సందేశం ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది. దాదాపు 7 లక్షలకు పైగా లైక్స్ రాగా, 4 వేలకు పైగా అభిమానులు తమ కామెంట్లతో హోరెత్తించారు. అటు ప్రభాస్ అభిమానులు, శ్రద్ధాకపూర్ అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు.
Recommended Video


శ్రద్ధాకపూర్ కెరీర్ గురించి
ఇక శ్రద్ధాకపూర్ కెరీర్ విషయానికి వస్తే.. తీన్ పత్తి అనే మూవీతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆషికీ 2తో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకొన్నది. స్టీట్ డ్యాన్సర్, స్త్రీ లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు సంపాదించిపెట్టాయి. త్వరలోనే ఆమె నటించిన భాగీ 3 చిత్రం మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











