దాని శక్తి అదే.. శ్రద్దా కపూర్ పోస్ట్ వైరల్
సెలెబ్రిటీలందరూ దాదాపు యోగాలు, వర్కవుట్లు చేస్తూ తమ ఫిట్ నెస్‌ను కాపాడుకుంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే నిత్యం వర్కవుట్లతోనే బిజీగా ఉంటారు. జీరో సైజ్ కోసం కొందరు.. ఆరోగ్యంగా సమతుల్యంగా ఉంచేందుకు ఇంకొందరు వర్కవుట్లు చేస్తుంటారు. తాజాగా శ్రద్ద కపూర్ మాత్రం శూన్యం కోసం ధ్యానం చేస్తుందట. అంతే కాకుండా శూన్య స్థితిలే ఉండే, కలిగే అనుభూతలను చెప్పింది.
ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడమే నా జీవితంలో ముఖ్యమైన లక్ష్యం. ఆరోగ్యం సరిగ్గా ఉంటే.. మన జీవితాన్ని బ్యాలెన్స్ చేయవచ్చు.. మనసుకు ప్రశాంతత దొరుకుతుంది.. పైగా శూన్య స్థితిలోకి వెళ్లేందుకు ఆరోగ్యంగా సరిగా ఉండటం ముఖ్యం. శూన్య స్థితి అంటే జీరో. అంటే నా దృష్టిలో ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థానానికి చేరుకోవడమని అర్థం. ఆ స్థితికి చేరుకోవడం అంటే.. మళ్లీ మన రూట్స్ దగ్గరికి మనం వెళ్లడమని అర్థం.

పాజిటివిటీ, ప్యూరిటీ, మంచితత్త్వం అన్నీ కూడా అక్కడే ఉంటాయి.. అదే శూన్యత శక్తి అంటూ శ్రద్దా కపూర్ తాను వేసిన ఆసనం గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రద్దా కపూర్ బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది ఈ భామ. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తోన్న లవ్ రంజన్ సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఢిల్లీలో ఈ మూవీ షూటింగ్ విజయవంతంగా ముగిసింది.


Click it and Unblock the Notifications











