twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బైక్ మీద నుంచి పడిపోయిన హీరోయిన్.. వీడియో వైరల్

    |

    కన్నడ పరిశ్రమలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది శ్రద్దా శ్రీనాథ్. తమిళంలోనూ మంచి పాత్రలను చేసి అక్కడా సక్సెస్ అయింది. తెలుగులో జెర్సీ చిత్రంతో నాని పక్కన సరిసమానంగా నటించి ఇక్కడా విజయాన్ని సాధించింది. అయితే తదుపరి వచ్చిన చిత్రాలేవీ శ్రద్దా శ్రీనాథ్‌కు అంతగా పేరు తీసుకురాలేదు. తాజాగా కృష్ణ అండ్ హిజ్ లీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సంద్భరంగా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది.

    భారతీయ చిత్రంలో ఓ బోల్డ్ ఫీమేల్ క్యారెక్టర్ అని చెప్పుకునేవారికి కనీసం ఒక్క బైక్ రైడ్ షాట్ లేకపోతే ఎలా. అది 2017 జూన్, నందిని హిల్స్‌లో షూట్ చేస్తున్నాం. ఆ రోజు వర్షం పడింది రోడ్లు అంతా తడిగానే ఉంది. మా డైరెక్టర్ రవికాంత్ వచ్చి.. బైక్ రైడింగ్ వచ్చా అని అడిగాడు. నేను రాదని చెప్పాను. కానీ నేను చేయగలను అని అతనితో చెప్పాను. అంతే వెంటనే ఓ బైక్ తీసుకున్నాను.

    Shraddha Srinath Falls From Bike Ride

    ఎనిమిదేళ్ల ప్రాయంలో నేను తెలుసుకున్న నాలెడ్జ్‌తో బైక్ స్టార్ట్ చేశాను, గేర్ వేశాను.. బ్యాలెన్స్ చేశాను.. అదే నాకు మొదటిసారి అంతకుముందెన్నడూ బైక్ నడపలేదు. అందుకే అది అంత కష్టమైన పనేమీ కాదని నేను భావించాను. నేను షాట్ కోసం కాంప్రమైజ్ కాలేకపోయాను. ఆ సమయంలోనే ఇది జరిగింది. నా అసిస్టెంట్ ప్రశాంత్ ఆ వీడియోను రికార్డ్ చేశాడు. కింద పడిన సమయంలో అందరూ నా వద్దకు వచ్చి సాయం చేశారు. కానీ బైక్‌కు గీతలు పడ్డాయని బాగా ఫీలయ్యాను. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు ఎందుకింత బరువుతా ఉంటాయ్ డ్యూడ్' అని కృష్ణ అండ్ హిజ్ లీల సంగతులను చెప్పుకొచ్చింది.

    English summary
    Shraddha Srinath Falls From Bike Ride. Are you even a bold female character in an Indian film if you don’t have at least one bike riding shot?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X