‘కేజీఎఫ్’ యష్ కంటే నాని నాకు ఇష్టం... అలా అంటే ఫ్యాన్స్ కోపం.. శ్రద్ధా శ్రీనాథ్
Recommended Video
యూటర్న్ విజయంతో తమిళ, కన్నడ చిత్ర రంగాల్లో దూసుకెళ్తున్న శ్రద్ధా శ్రీనాథ్ తన ఖాతాలో మరో సక్సెస్‌ను వేసుకొన్నది. తాజాగా ఆమె నటించిన జెర్సీ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. జెర్సీ ప్రమోషనల్‌లో భాగంగా శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. నాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

హీరో యష్ కంటే నానినే
జెర్సీలో నానితో నటించావు.. కన్నడలో యష్ పరిచయం ఉంది.. వారిలో ఎవరు ఎక్కువ ఇష్టం అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. యష్ కంటే నాకు నాని ఇష్టం అని అన్నారు. నేను ఓ స్టార్‌గా నానితో కలిసి జెర్సీలో నటించాను. నాకు యష్ కంటే నాని అంటే రెస్పెక్ట్. తన స్టార్‌డమ్ కోసం యష్ చాలా కష్టపడ్డాడు. సినిమాల్లోకి రావడానికి ముందు టెలివిజన్ తెరపై కనిపించాడు. కన్నడ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశాడు. అయినా నాని అంటే నాకు ప్రత్యేకం అని శ్రద్ధా అన్నారు

నానిని దగ్గరగా చూశాను
నేను యష్‌ను ఒక్కసారి మాత్రమే కలిశాను. వ్యక్తిగతంగా అతను ఎలాంటి వాడో నాకు తెలియదు. కానీ జెర్సీలో నానిని చాలా దగ్గరగా చూశాను. ఎదుటి వ్యక్తిని గౌరవించే తీరు.. సహకరించే విధానం నాకు బాగా నచ్చుతుంది. అందుకే నాని అంటే నాకు చాలా ఇష్టం. నాని పక్కా ప్రొఫెషనల్ అని అని శ్రద్దా శ్రీనాథ్ అన్నారు.

అలా అంటే ఫ్యాన్స్‌కు కోపం
టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో ఏది ఇష్టమని అడిగిన ప్రశ్నకు శ్రద్ధా శ్రీనాథ్ సమాధానం ఇస్టూ.. నాకు అన్ని రంగాలు ఇష్టం. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ రంగాలు వేటికవే గొప్ప. అన్ని చోట్ల ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తారు. అదే నాకు ఇష్టం. ఒకవేళ నేను ఏదో ఇండస్ట్రీ ఇష్టం అంటే ఫ్యాన్స్‌కు కోపం వస్తుంది అని శ్రద్ధా శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు.

శ్రద్ధా శ్రీనాథ్ సినీ కెరీర్
శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్ విషయానికి వస్తే.. కోహినూర్ అనే మలయాళ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కన్నడలో యూటర్న్‌తో, తమిళంలో చెలియా చిత్రంతో విజయం అందుకొన్నది. బాలీవుడ్‌లో తిగ్మాన్షు దూలియా దర్శకత్వంలో మిలన్ టాకీస్‌లో నటించింది. తాజాగా జెర్సీతో మరో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











