ఇదే నా చివరి హెచ్చరిక.. లేదంటే చర్యలు తప్పవు.. బిగ్ బాస్ 4 రూమర్స్ పై హీరోయిన్ ఆగ్రహం

ఇండియన్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పై కథనాలు ఏ రేంజ్ లో వెలువడుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ తరువాత మొదట తెలుగులోనే షో హడావుడి చేయబోతోంది. ఇప్పటికే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంటెస్టెంట్స్ కి సంబంధించిన వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి. ఇక ఆ రూమర్స్ పై కొందరు నటీనటులు కూల్ గా స్పందిస్తుండగా మరికొందరు సీరియస్ అవుతున్నారు.

 కంటెస్టెంట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లే

కంటెస్టెంట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లే

గతంలో ఎప్పుడు లేని విదంగా బిగ్ బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ పై అంచనాల డోస్ గట్టిగానే పెరుగుతోంది. ఎందుకంటే షోలో కంటెస్టెంట్స్ ని ఏ విదంగా సెలెక్ట్ చేస్తారు కరోనా కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ 4 కోసం కంటెస్టెంట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లే అనే కథనాలు కూడా వస్తున్నాయి.

 వారి పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి

వారి పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి

యాంకర్స్, సింగర్స్, సీరియల్ యాక్టర్స్, సినీ యాక్టర్స్.. ఇలా అందరి పేర్లు వస్తున్నాయి. మొన్న తరుణ్ పేరు కూడా రాగా.. వెంటనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు ఆ షోలో పాల్గొనడం కూడా ఇంట్రెస్ట్ లేదని అన్నాడు. ఇక ఇటీవల శ్రద్దా దాస్ పై కూడా రూమర్స్ డోస్ ఎక్కువవ్వడంతో అమ్మడు చాలా సీరియస్ అయ్యింది.

 క్లారిటీ ఇచ్చిన శ్రద్దా దాస్

క్లారిటీ ఇచ్చిన శ్రద్దా దాస్

శ్రద్దా దాస్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇస్తూ .. బిగ్ బాస్ కోసం నన్ను ఎవరు కూడా సంప్రదించలేదు. నేను అందులో పాల్గొనాలని కూడా అనుకోవడం లేదు. బిగ్ బాస్ లో పాల్గొంటున్నారా అని చాలా మంది మెస్సేజ్ చేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలి. అలాంటి తప్పుడు వార్తలు రాసేవారికి నా మొదటి, చివరి హెచ్చరికగా తెలియజేస్తున్నాను.

 ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే

ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే

నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని శ్రద్దా దాస్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించింది. ఈ ఒక్క క్లారిటీ ఇవ్వడంతో బిగ్ బాస్ లోకి రావడానికి ఈ బ్యూటీకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని అర్థమయ్యింది. ఇక జబర్దస్త్ కమెడియన్స్, యాంకర్స్ వంటి వారి పేర్లు కూడా బాగానే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Recommended Video

Sri Reddy Negative Facebook Post On HIT Movie And Hero Nani
కరోనా పరీక్షలు

కరోనా పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న తరుణంలో షో యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీలుకుంటుంది అనే ఆలోచన అందరిలో ఉంది. అయితే షో మొదలయ్యే రోజే తీసుకున్న జాగ్రత్తలపై ఒక వీడియో ద్వారా వివరణ ఇవ్వనున్నారట. షో స్టార్ట్ అయ్యే 14రోజుల ముందు అలాగే షోకి వెళ్లే ముందు రోజు కూడా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించిన తరువాత కంటెస్టెంట్స్ ని హౌజ్ లోకి పంపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X