twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NNNను మించిపోయేలా.. శ్రీ రాపాకతో ఆర్జీవీ మరో సినిమా.. అందుకోసం అది తప్పదట!

    |

    నగ్నం సినిమాతో స్వీటీ (శ్రీ రాపాక) రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్, లాక్ డౌన్ అనే పదాలు ఎంతగా ఫేమస్ అయ్యాయో.. నగ్నం, శ్రీ రాపాక పేర్లు అంతగా ఫేమస్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన NNN (నేక్డ్, నగ్నం, నంగా) చిత్రంతో శ్రీ రాపాక ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. శ్రీ రాపాక ప్రస్తుతం యూట్యూబ్‌లో బోల్డ్ ఇంటర్వ్యూలతో నానా రచ్చ చేస్తోంది.

    సినీ ఇండస్ట్రీకి పాతే..

    సినీ ఇండస్ట్రీకి పాతే..

    శ్రీ రాపాక తెలుగు ప్రేక్షకులకు ఇలా పరిచయం అవ్వడం కొత్తేమోగానీ.. సినీ ఇండస్ట్రీకి మాత్రం చాలా పాత. ఫ్యాషన్ డిజైనర్ కొన్నేళ్లుగా సినిమా రంగంలో పని చేస్తోంది. దేశ ముదురు సమయంలోనే శ్రీ రాపాక ఇండస్ట్రీలో ఉందట. దాదాపు దర్శక నిర్మాతలు, కొంతమంది హీరోలతో పరిచయం ఉందట.

    పవన్ కళ్యాణ్‌పై క్రష్..

    పవన్ కళ్యాణ్‌పై క్రష్..

    వరుసగా యూట్యూబ్ ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తోంది. తనకు పవన్ కళ్యాణ్ అంటే క్రష్ అని.. కలవడానికి రెండు మూడు సార్లు ప్రయత్నాలు కూడా చేశానని, కానీ విఫలమయ్యానని చెప్పుకొచ్చింది.

    వరుస ప్రాజెక్ట్‌లు..

    వరుస ప్రాజెక్ట్‌లు..

    ప్రస్తుతం శ్రీ రాపాక వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. నగ్నం సినిమాతో ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయట. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయట. అయితే వర్మతో మరోసినిమా కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
    అది వేరే లెవెల్..

    అది వేరే లెవెల్..

    అయితే వర్మతో చేయబోయే తదుపరి చిత్రం మరో లెవెల్‌లో ఉండోబోతోందని క్లూ ఇచ్చింది. అందుకోసం వెయిట్ తగ్గి సన్నగా కావాలని ఆర్జీవీ చెప్పాడట. తాను ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమా తీసేందుకు సిద్దంగా ఉన్నాడని, అయితే వెయిట్ లాస్ కావాలని, అంతకు ముందే చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది.

    English summary
    Shree rapaka One More Movie With RGV. shree rapak says that they will do one mor movie. but for that she has to lose weight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X