Shree Rapaka : ఆ డైరెక్టర్ తో లవ్ స్టొరీ.. పెద్ద హీరోతో సినిమా .. ఊహించని విధంగా బ్రేకప్ బయట పెట్టేసిందిగా
24 గంటల లైవ్ అంటూ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రెండు వారాలని పూర్తి చేసుకుంది. మొదటి వారం నుంచి ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి గతంలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ కూడా షోలో ఉన్నారు. మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. దీంతో ఈ సారి గేమ్ వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టు సాగుతుంది. ప్రస్తుతానికి ఆ పేర్లు తొలగించారు కానీ ఇంకా టీములుగానే గేమ్ ఆడుతున్నారు కంటెస్టెంట్స్. అయితే రెండో వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన శ్రీ రాపాక తన లవ్ స్టోరీ బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

రాత్రికి రాత్రి ఫేమస్
రెండో వారంలో మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడగా చివరిగా బిగ్‌బాస్ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటున్న శ్రీ రాపాకని తన నగ్నం షార్ట్ ఫిలింతో హీరోయిన్ ని చేశారు ఆర్జీవీ. ఇందులో చాలా బోల్డ్ గా నటించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయింది శ్రీరాపాక.

జాతీయ స్థాయిలో
ఫ్యాషన్ డిజైనర్ అయినా ఆర్జీవీ పుణ్యమా అంటూ తర్వాత యాక్టర్ గా కూడా బిజీ అయింది ఈ బోల్డ్ బ్యూటీ. ఈ సారి బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో శ్రీ రాపాక కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆర్జీవీ కూడా శ్రీరాపాక కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆర్జీవీ సపోర్ట్ తో శ్రీ రాపాకకి మరింత ప్లస్ అవుతుందని అనుకున్నా అదేమీ వర్కౌట్ అవలేదు. ఆమె పుట్టింది గోదావరి జిల్లాల్లో అయినా పెరిగింది మాత్రం హైద్రాబాద్‌లో. చిన్నతనంలో కబడ్డీ,కోకో వంటి ఆటలు ఆడింది, పలు సార్లు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి.

నటిగా మారాన
పదో తరగతి వచ్చే సరికి తన మెడలో ఎన్నో మెడల్స్ ఉండేవని శ్రీ రాపాక చెబుతూ ఉంటుంది. ఓ సారి ఆటల పోటీలో భాగంగా.. ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయిని తెలంగాణ ప్రతినిధిగా ఎలా ఎంపిక చేస్తామని అన్నారట. ఆ మాటలతో ఆటలను వదిలేశాను అని శ్రీ రాపాక ఇంట్రడక్షన్ రోజు స్టేజ్ మీద చెప్పుకొచ్చింది కూడా. తనకు తల్లిదండ్రులంటే ఎంతో ఇష్టమని, డిజైనర్‌గా కెరీర్ మొదలు పెట్టి నటిగా మారానని తెలిపింది. బిగ్ బాస్ అవకాశం రావడం డైమండ్ లాంటిదని శ్రీ రాపాక అభిప్రాయపడింది.

అభిప్రాయ భేదాలు రావడంతో
తాను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలని తన ఇంట్లో చిన్న పిల్లలు కూడా దేవుడిని మొక్కారంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఎలిమినేషన్ అయ్యాక బయటకు రావడంతో పలు సంస్థలు ఇంటర్వ్యూ ఇస్తోంది. అందులో భాగంగానే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తాను ఒక దర్శకుడి తో ప్రేమలో ఉండేదాన్ని కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయాం అని చెప్పుకొచ్చింది.

పెద్ద హీరోతో
ఆ దర్శకుడు ప్రస్తుతం నాలుగో సినిమా చేస్తున్నాడు అని ఒక పెద్ద హీరోతో ఆ న సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చింది. సాధారణంగా ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి అధికారం ఉంటుందని అతను కూడా అలాగే తన మీద ఎక్కువ ప్రేమ చూపించడంతో అది తమ మధ్య దూరం పెరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. అతని గురించి తప్పుగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవు కాబట్టి ఎలాంటి కామెంట్ చేయను అని ఆమె చెప్పుకొచ్చింది


Click it and Unblock the Notifications











